ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Health Organization : ‘డిజిటల్‌’ కండోమ్‌!

ABN, Publish Date - Oct 28 , 2024 | 03:55 AM

వ్యక్తుల శరీరంలో ఓ భాగమై.. ప్రైవేటు జీవితంలోకి చొచ్చుకెళ్లింది సెల్‌ ఫోన్‌. పైగా సైబర్‌ నేరాలు విపరీతంగా పెరిగిన కాలం ఇది.

  • యాప్‌ రూపొందించిన జర్మనీ సంస్థ బిల్లీ బాయ్‌

  • శృంగార సమయంలో రహస్య రికార్డింగ్‌లకు చెక్‌

  • కామ్‌డొమ్‌గా పేరు.. 30 పైగా దేశాల్లో విడుదల

బెర్లిన్‌, అక్టోబరు 27: వ్యక్తుల శరీరంలో ఓ భాగమై.. ప్రైవేటు జీవితంలోకి చొచ్చుకెళ్లింది సెల్‌ ఫోన్‌. పైగా సైబర్‌ నేరాలు విపరీతంగా పెరిగిన కాలం ఇది. ఇక కొందరు.. సన్నిహిత సందర్భాలను స్మార్ట్‌ ఫోన్లలో రహస్యంగా రికార్డు చేస్తూ ఆ తర్వాత వాటిని చూపి బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇలాంటివాటికి అవకాశం లేకుండా జర్మనీకి చెందిన లైంగిక ఆరోగ్య సంస్థ బిల్లీ బాయ్‌ ఓ యాప్‌ను తీసుకొచ్చింది. దీని పేరు కామ్‌డొమ్‌. రహస్య రికార్డింగ్‌లకు చెక్‌ పెట్టేలా రూపొందించిన ఈ యాప్‌ను.. సన్నిహిత సందర్భాల్లో, శృంగారంలో పాల్గొనేముందు మొబైల్‌ ఫోన్లను ఒకదగ్గరకు చేర్చి యాక్టివేట్‌ చేయాల్సి ఉంటుంది. వర్చువల్‌ బటన్‌ స్వైప్‌ చేస్తే.. బ్లూ టూత్‌ ద్వారా కెమెరా, మైక్రోఫోన్‌లు రికార్డు చేయకుండా చూస్తుంది. ఏదైనా ఫోన్‌ను అన్‌ బ్లాక్‌ చేసేందుకు ప్రయత్నిస్తే అలర్ట్‌ సైరన్‌ మోగుతుంది. ఈ యాప్‌ ద్వారా పలు డివైజ్‌లను ఒకేసారి నియంత్రిచడం సాధ్యమని బిల్లీ బాయ్‌ తెలిపింది. కాగా, కామ్‌డొమ్‌ను డిజిటల్‌ కండోమ్‌గా వ్యవహరిస్తున్నారు. నిజమైన కండోమ్‌లను వినియోగించినంత సులభం అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. బిల్లీ బాయ్‌ దీనిని 30 పైగా దేశాల్లో విడుదల చేసింది.

Updated Date - Oct 28 , 2024 | 03:55 AM