Share News

Crime News: మహిళలపై ద్వేషంతో ముక్కలుగా కోసి 42 హత్యలు.. కెన్యాలో సైకో కిల్లర్

ABN , Publish Date - Jul 21 , 2024 | 11:10 AM

అతను మహిళలపై ద్వేషం పెంచుకున్నాడు. వారిపై పగ తీర్చుకోవడానికి సొంత భార్యతో సహా, 42 మందిని అత్యంత దారుణంగా హత్య చేశాడు. వారందరినీ ముక్కలుగా కోసి చెత్త కుప్పల్లో పడేశాడు. ఇదంతా కెన్యాకు చెందిన ఓ సైకో కిల్లర్ కథ.

Crime News: మహిళలపై ద్వేషంతో ముక్కలుగా కోసి 42 హత్యలు.. కెన్యాలో సైకో కిల్లర్

ఇంటర్నెట్ డెస్క్: అతను మహిళలపై ద్వేషం పెంచుకున్నాడు. వారిపై పగ తీర్చుకోవడానికి సొంత భార్యతో సహా, 42 మందిని అత్యంత దారుణంగా హత్య చేశాడు. వారందరినీ ముక్కలుగా కోసి చెత్త కుప్పల్లో పడేశాడు. ఇదంతా కెన్యాకు చెందిన ఓ సైకో కిల్లర్ కథ. చివరికి పోలీసులకు దొరకగా విచారణలో సంచలన విషయాలు బయటపడ్డాయి. కెన్యా రాజధాని నైరోబీకి చెందిన కాలిన్స్ జుమైసి ఖలుషా(33) మహిళలపై ద్వేషం పెంచుకున్నాడు.

దీంతో వారిని హత్య చేయాలని నిర్ణయించాడు. కత్తి సాయంతో హత్యలు చేయడం ప్రారంభించారు. అలా తన భార్యను హత్య చేసి శరీర భాగాలను కోసి, సంచిలో చుట్టి నైరోబీలోని స్క్రాప్‌యార్డ్‌లో పడేశాడు. అయితే బాధితుల్లో ముకురు క్వాన్జెంగాకు చెందిన 26 ఏళ్ల హెయిర్ బ్రైడర్ జోసెఫిన్ ఓవినో కూడా ఉన్నారు.


ఓవినో ఉదయం ఫోన్ కాల్ రావడంతో బయటకి వెళ్లి అదృశ్యమైంది. ఆమె సోదరి పెరిస్ కీయా.. బ్రైడర్ కోసం వెతగ్గా ఎక్కడా ఆచూకీ లభించలేదు. పోలీసులకు సమాచారం అందించడంతో వారు కొందరి సాయంతో నైరోబీలోని డంప్ యార్డ్‌కి చేరుకుని తనిఖీ చేశారు. అక్కడ దుర్వాసనతో కూడిన 9 బస్తాలు బయటపడ్డాయి. వాటిని తెరిచి చూసిన పోలీసులు విస్తుపోయారు.

అందులో చాలా మృతదేహాలు కుళ్లిపోయిన స్థితిలో ఉన్నాయి. దుర్వాసనతో చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించింది. కొన్ని మృతదేహాలైతే ఎవరివో కూడా గుర్తించలేని స్థితి ఏర్పడింది. అందులో ఒక మృతదేహం తప్పా అన్నింటినీ ముక్కలుగా నరికి సంచుల్లో చుట్టివేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిని పట్టుకోవడానికి కెన్యా ప్రభుత్వం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. చివరికి హత్యలు చేసిన నిందితుడిని అదుపులోకి తీసుకుంది. అతని విచారణలో సంచలన విషయాలు బయటపడుతున్నాయి.


నిందితుడి నుంచి ఫోన్లు, గుర్తింపు కార్డులు, నైలాన్ బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాలు ఉన్న బస్తాలలో కోసిన అవయవాలతోపాటు, మొండెం ఉన్నాయి. మృతదేహాలపై బుల్లెట్ గాయాలు లేవని పోలీసులు తెలిపారు.

మహిళల రక్షణలో కెన్యా పోలీసు యంత్రాంగం విఫలమైందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. డంపింగ్‌ గ్రౌండ్‌.. పోలీస్‌ స్టేషన్‌కు సమీపంలో ఉన్నా గుర్తించకపోవడం పోలీసు వ్యవస్థ సామర్థ్యం, పర్యవేక్షణపై ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే రాజకీయ అశాంతి, ఆర్థిక సవాళ్లతో ఇబ్బంది పడుతున్న కెన్యా సర్కార్‌కు తాజా హత్యలు కలవరపెడుతున్నాయి. నిందితుడికి కఠిన శిక్షలు అమలు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

For Latest News and National News click here

Updated Date - Jul 21 , 2024 | 11:10 AM