Shocking: ‘హలో.. మా నన్న, తమ్ముడిని చంపేశా’.. వచ్చేయండంటూ పోలీసులకు అమ్మాయి ఫోన్..!
ABN, Publish Date - Feb 16 , 2024 | 03:27 PM
America News: ‘హలో, నేను మా తమ్ముడు, నాన్నను కాల్చి చంపేశాను. మా తమ్ముడు చనిపోయాడు. నాన్న కొన ఊపిరితో ఉన్నారు’ అంటూ ఓ బాలిక పోలీసులకు ఫోన్ చేసి చెప్పడం సంచలనం రేపుతోంది. అయితే, ఈ ఘటన మనం దేశంలో జరుగలేదు. అమెరికాలోని నెవాడాలో చోటు చేసుకుంది. బాలిక ఫోన్ కాల్‌తో విస్తుపోయిన పోలీసులు.. ఘటనా స్థలికి చేరుకుని చూడగా షాకింగ్ సీన్ కనిపించింది.
America News: ‘హలో, నేను మా తమ్ముడు, నాన్నను కాల్చి చంపేశాను. మా తమ్ముడు చనిపోయాడు. నాన్న కొన ఊపిరితో ఉన్నారు’ అంటూ ఓ బాలిక పోలీసులకు ఫోన్ చేసి చెప్పడం సంచలనం రేపుతోంది. అయితే, ఈ ఘటన మనం దేశంలో జరుగలేదు. అమెరికాలోని(America) నెవాడాలో చోటు చేసుకుంది. బాలిక ఫోన్ కాల్‌తో విస్తుపోయిన పోలీసులు.. ఘటనా స్థలికి చేరుకుని చూడగా షాకింగ్ సీన్ కనిపించింది. ఇంట్లో రెండు మృతదేహాల మధ్య బాలిక ఉంది. ఈ దృశ్యాన్ని చూసి పోలీసులు సైతం హడలిపోయారు. మరి బాలిక.. తన తండ్రిని, తమ్ముడిని ఎందుకు చంపింది? వివరాలు తెలుసుకుందాం..
వివరాలిలా..
అమెరికాలోని నెవాడాకు చెందిన రెనోలో(17) అనే బాలిక తన తండ్రి, 5ఏళ్ల తమ్ముడిని తుపాకీతో కాల్చి చంపేసింది. ఇంట్లో తుపాకీ పేలిన శబ్ధం వినిపించగా.. వారు పోలీసులకు కాల్ చేసి చెప్పారు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లేందుకు సిద్ధమవగానే.. మరో కాల్ వచ్చింది. అటు నుంచి ఓ అమ్మాయి మాట్లాడుతూ.. నా తమ్ముడిని, నాన్నను నేను తుపాకీతో కాల్చేశానని.. ఇద్దరూ చనిపోయారని చెప్పింది. దాంతో షాక్ అయిన పోలీసులు.. కాల్ డిస్‌కనెక్ట్ చేసి బాలిక ఇంటికి చేరుకున్నారు. ఇంట్లో దృశ్యాన్ని చూసి హడలిపోయారు పోలీసులు. ఇంట్లో రెండు మృతదేహాలు పడి ఉన్నాయి. డెడ్ బాడీలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. పోస్టుమార్టం కోసం పంపించారు. ఘటనా స్థలిలోనే అమ్మాయి ఉండగా.. తమకు కాల్ చేసింది ఎవరు? అని పోలీసులు ప్రశ్నించారు. తానే చేశానని, ఈ హత్యలు చేసింది కూడా తానేనని బాలిక చెప్పింది.
అసలేం జరిగింది?
హత్యకు ఉపయోగించిన తుపాకీని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. బాలికను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరినీ ఎందుకు హత్య చేసిందనే విషయాన్ని మాత్రం బాలిక వెల్లడించలేదట. పైగా వారిని చంపడం తనకు ఏమాత్రం ఇష్టం లేదని బాలిక చెప్పింది. దీంతో కన్‌ఫ్యూజ్ అయిన పోలీసులు.. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇంటిని కూడా సీజ్ చేశారు. హత్యకు గల కారణాలు తెలియకపోవడంతో పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
Updated Date - Feb 16 , 2024 | 04:33 PM