ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Singapore: సెమీకండక్టర్ల తయారీకి సింగపూర్‌ సహకారం

ABN, Publish Date - Sep 06 , 2024 | 05:28 AM

భారత్‌లో సెమీకండక్టర్ల తయారీకి సింగపూర్‌ సహకరించనుంది.

  • ఆ దేశ ప్రధానితో నరేంద్ర మోదీ భేటీ

  • హెల్త్‌కేర్‌, ఇతర రంగాలపైనా ఒప్పందాలు

  • ప్రతి దేశానికి స్ఫూర్తిదాయకం సింగపూర్‌: మోదీ

సింగపూర్‌ సిటీ, సెప్టెంబరు 5: భారత్‌లో సెమీకండక్టర్ల తయారీకి సింగపూర్‌ సహకరించనుంది. గురువారం ఈ మేరకు సెమీకండక్టర్ల తయారీలో సహాకరంతోపాటు.. నాలుగు కీలక అం శాలపై ఇరు దేశాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, సింగపూర్‌ ప్రధాని లారెన్స్‌ వాంగ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఈ ఒప్పందాలతో భారత్‌, సింగపూర్‌ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం బలపడతాయని అభిప్రాయపడ్డారు.


సెమీకండక్టర్ల రంగంతోపాటు.. కనెక్టివిటీ, డిజిటలైజేషన్‌, హెల్త్‌కేర్‌ అండ్‌ మెడిసిన్‌, స్కిల్‌ డెవల్‌పమెంట్‌కు సంబంధించి, ఇరు దేశాల మధ్య నాలుగు ఒప్పందాలు జరిగాయని భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ భేటీ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. తాజా ఒప్పందంతో భారతదేశ ‘యాక్ట్‌ ఈస్ట్‌ పాలసీ’కి భారీ ప్రోత్సాహం లభిస్తుందని అభిప్రాయపడ్డా రు. ‘‘ఆర్థిక సంబంధాల విషయంలో.. ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులను మరింత విస్తరించాలని ఈ భేటీలో నిర్ణయించాం. 160 బిలియన్‌ డాలర్ల(రూ.1.34 లక్షల కోట్లు) పెట్టుబడితో భారత్‌కు సింగపూర్‌ ప్రధాన ఆర్థిక భాగస్వామి.


రక్షణ, సముద్ర వనరులు, విద్య, కృత్రిమ మేధ, ఫిన్‌టెక్‌, శాస్త్రసాంకేతిక రంగాల్లో ఇప్పటికే ఉన్న సహకారంపైనా చర్చించాం’’ అని వ్యాఖ్యానించారు. అనంతరం తమ భేటీ వివరాలను ప్రధాని మోదీ తన ఎక్స్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. అంతకు ముందు ఇరువురు ప్రధానులు సెమీకండక్టర్ల కంపెనీని సందర్శించారు. రెండ్రోజుల సింగపూర్‌ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ.. సింగపూర్‌ అధ్యక్షుడు ధర్మన్‌ షణ్ముగరత్నంతో భేటీ కానున్నారు. సీనియర్‌ మం త్రి లీ సియన్‌ లూంగ్‌ ఇచ్చే విందులో పాల్గొననున్నారు. కాగా.. గురువారం సాయంత్రం మోదీ సింగపూర్‌కు చెందిన దిగ్గజ కంపెనీల సీఈవోలతో భేటీ అయ్యారు.

Updated Date - Sep 06 , 2024 | 05:28 AM

Advertising
Advertising