ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అమెరికా ఎన్నికల బరిలో ‘భారతపౌరులు’

ABN, Publish Date - Nov 06 , 2024 | 03:36 AM

అమెరికా ప్రతినిధులసభ ఎన్నికల్లో భారత సంతతి పౌరులు తమ సత్తా చాటుతున్నారు. మొత్తం 9 మంది భారతీయ అమెరికన్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వీరిలో ఐదుగురు సీనియర్‌ నాయకులు మరోసారి బరిలో నిలిచారు.

  • 9 మంది భారతీయ అమెరికన్లు పోటీ

వాషింగ్టన్‌, నవంబరు 5: అమెరికా ప్రతినిధులసభ ఎన్నికల్లో భారత సంతతి పౌరులు తమ సత్తా చాటుతున్నారు. మొత్తం 9 మంది భారతీయ అమెరికన్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వీరిలో ఐదుగురు సీనియర్‌ నాయకులు మరోసారి బరిలో నిలిచారు.

  • సుహాస్‌ సుబ్రమణ్యన్‌(38): డెమొక్రాటిక్‌ అభ్యర్థిగా వర్జీనియా(10వ కాంగ్రెషనల్‌ డిస్ట్రిక్ట్‌) నుంచి బరిలో ఉన్నారు. ప్రస్తుతం వర్జీనియా రాష్ట్ర సెనేటర్‌గా వ్యవహరిస్తున్నారు. డెమొక్రాట్లకు బలమైన రాష్ట్రంగా పేరున్న వర్జీనియా నుంచి విజయం దక్కించుకుంటే ఇక్కడి నుంచి గెలిచిన తొలి ఇండియన్‌ అమెరికన్‌గా సుబ్రమణ్యన్‌ రికార్డు సృష్టిస్తారు. గతంలో అధ్యక్షుడు ఒబామాకు వైట్‌ హౌస్‌ సలహాదారుగా కూడా సుహాస్‌ ఉన్నారు.

  • డాక్టర్‌ అమిబెరా(59): వైద్య వృత్తిలో ఉన్న అమిబెరా సీనియర్‌ మోస్ట్‌ ఇండియన్‌ అమెరికన్‌ చట్టసభ సభ్యుడు. కాలిఫోర్నియా(6వ కాంగ్రెషనల్‌ డిస్ట్రిక్ట్‌) నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. 2013 నుంచి ఆయన విజయం సాధిస్తున్నారు. ఈసారి డెమొక్రాట్లు ప్రతినిధుల సభలో మెజారిటీ దక్కించుకుంటే డాక్టర్‌ బెరాకు కీలక పదవి దక్కనుంది.

  • ప్రమీలా జయపాల్‌(59): డెమొక్రాటిక్‌ పార్టీలో బలమైన నాయకురాలు. వాషింగ్టన్‌(7వ కాంగ్రెషనల్‌ డిస్ట్రిక్ట్‌) నుంచి మరోసారి ఆమె అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఆమె విజయం ఖాయమనే చర్చసాగుతోంది.

  • రాజా కృష్ణమూర్తి(51): డెమొక్రాటిక్‌ పార్టీకి చెందిన బలమైన నాయకుడు. 2017 నుంచి ఆయన చట్టసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇల్లినాయి్‌స(8వ కాంగ్రెషనల్‌ డిస్ట్రిక్ట్‌) నుంచి మరోసారి పోటీ చేస్తున్నారు.


  • రో ఖన్నా(48): 2017 నుంచి కాలిఫోర్నియా(17వ కాంగ్రెషనల్‌ డిస్ట్రిక్ట్‌) నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పుడు కూడా ఇక్కడే బరిలో ఉన్నారు.

  • శ్రీథానేదార్‌(69): మిచిగాన్‌(13వ కాంగ్రెషనల్‌ డిస్ట్రిక్ట్‌) నుంచి పోటీ చేస్తున్నారు. ఈయన 2023 నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాగా, ఈ ఆరుగురి గెలుపు ఖాయమని, వారి విజయం నల్లేరుపైనడకేనని పరిశీలకులు చెబుతున్నారు. మరోవైపు, అరిజోనా రాష్ట్ర అసెంబ్లీకి వరుసగా మూడు సార్లు(2018, 2020, 2022) ఎన్నికైన డాక్టర్‌ అమిష్‌ షా ప్రస్తుతం అరిజోనా(1వ కాంగ్రెషనల్‌ డిస్ట్రిక్ట్‌) నుంచి ప్రతినిధుల సభకు డెమొక్రాటిక్‌ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. ఇక్కడ నుంచి వరుసగా ఏడుసార్లు విజయం దక్కించుకున్న రిపబ్లికన్‌ అభ్యర్థి డేవిడ్‌ స్క్యూకెర్ట్‌తో అమిష్‌ తలపడుతుండడం గమనార్హం. రిపబ్లికన్‌ పార్టీకి చెందిన డాక్టర్‌ ప్రశాంత్‌ రెడ్డి కాన్‌సా్‌స(3వ కాంగ్రెషనల్‌ డిస్ట్రిక్ట్‌) నుంచి బరిలో ఉన్నారు. రిపబ్లికన్‌ పార్టీకి చెందిన డాక్టర్‌ రాకేశ్‌ మోహన్‌ న్యూజెర్సీ(3వ కాంగ్రెషనల్‌ డిస్ట్రిక్ట్‌) నుంచి బరిలో నిలిచారు. కాగా, డాక్టర్‌ ప్రశాంత్‌ రెడ్డి, డాక్టర్‌ రాకేశ్‌ మోహన్‌లకు గెలుపు అవకాశాలు స్వల్పంగా ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.

  • స్థానిక సంస్థల్లోనూ భారత సంతతి!

అమెరికాలోని స్థానిక సంస్థలు, రాష్ట్రాల చట్టసభల ఎన్నికల్లోనూ భారత సంతతి పౌరులు తమ సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. దాదాపు 36 మందికిపైగా ఈ ఎన్నికల్లో తలపడుతున్నారు. అమెరికాల్లో అత్యంత స్వల్పంగా ఉన్న భారత సంతతి పౌరులు ఇలా కీలక ఎన్నికల్లో తలపడుతున్న పరిస్థితి.. వారికి అగ్రరాజ్యం ఎన్నికలపై ఉన్న ఆసక్తిని చాటి చెబుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. కాలిఫోర్నియా స్థానిక సంస్థల ఎన్నికలకు ఎక్కువ మంది భారత సంతతి పౌరులు పోటీ పడుతున్నారని తెలిపారు. కాలిఫోర్నియాలో దాదాపు 9 లక్షల మంది భారతీయ అమెరికన్లు నివసిస్తున్నారు.

Updated Date - Nov 06 , 2024 | 03:36 AM