Bus: నదిలో పడిన పర్యాటకుల బస్సు.. 14 మంది మృతి
ABN, Publish Date - Aug 23 , 2024 | 12:52 PM
దాదాపు 40 మంది భారతీయ టూరిస్టులతో వెళ్తున్న బస్సు(bus) ఘోర ప్రమాదానికి(accident) గురైంది. అబుఖైరేని, తనహున్ సమీపంలోని మర్స్యంగ్డి నదిలో బస్సు పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 14 మంది ప్రయాణికులు మరణించారు.
దాదాపు 40 మంది భారతీయ టూరిస్టులతో వెళ్తున్న బస్సు(bus) ఘోర ప్రమాదానికి(accident) గురైంది. యూపీలోని గోరఖ్‌పూర్ నుంచి నేపాల్‌కు పర్యాటకులతో వెళ్తున్న క్రమంలో ప్రమాదం జరిగింది. బస్సు పోఖారా నుంచి ఖాట్మండు వెళ్తున్న నేపథ్యంలో మార్గమధ్యంలో అబుఖైరేని, తనహున్ సమీపంలోని మర్స్యంగ్డి నదిలో బస్సు పడిపోయింది. ఈ విషాధ ఘటన నేపాల్(nepal) తనహున్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 14 మంది ప్రయాణికులు మరణించారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
పోలీసులు
సమాచారం అందుకున్న అక్కడి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. నేపాల్ పోలీసులు మాట్లాడుతూ 40 మందితో ప్రయాణిస్తున్న భారతీయ ప్రయాణీకుల బస్సు తనహున్ జిల్లాలో మర్స్యంగ్డి నదిలో పడిపోయిందన్నారు. జిల్లా డీఎస్పీ దీప్‌కుమార్ రాయ ఈ విషయాన్ని ధృవీకరించారు. యూపీ ఎఫ్‌టీ 7623 నంబర్ ప్లేట్ ఉన్న బస్సు నదిలో పడిపోయిందని ఆయన చెప్పారు.
అందుకే ప్రమాదం?
ఉదయం 11.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. బస్సు నదిలో పడిపోవడంతో అటుగా వెళ్తున్న వారు చూసి పోలీసులకు సమాచారం అందించారు. ఈ బస్సు ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ జిల్లాలోని ధర్మశాల మార్కెట్‌కు చెందిన సౌరభ్ కేసర్వాణి భార్య షాలినీ కేసర్వాణి పేరు మీద రిజిస్టర్ చేయబడింది. మలుపు వద్ద బస్సు అదుపు తప్పడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. నది ఒడ్డున ఉన్న నీటిలో బస్సు బోల్తా పడింది. ఈ కారణంగా చాలా మంది గల్లంతుకాగా, మరికొంత మంది రక్షించబడ్డారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి
సంప్రదింపులు
భారీ వర్షాల కారణంగా నది కూడా ఉధృతంగా ప్రవహిస్తోందని అధికారులు తెలిపారు. బస్సులో 40 మంది ఉండగా, వారిలో కొందరిని రక్షించారు. అయితే ఇంకా చాలా మంది గల్లంతయ్యారు. ఆ బస్సు ఉత్తరప్రదేశ్‌కు చెందినది. నేపాల్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి బస్సులో ప్రయాణిస్తున్న వారు ఎక్కడి నుండి వచ్చారో తెలుసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఉత్తరప్రదేశ్ రిలీఫ్ కమిషనర్ తెలిపారు. అందుకోసం సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు.
ఇవి కూడా చదవండి:
Mike Lynch: బ్రిటన్ 'బిల్ గేట్స్' సహా ఐదుగురి మృతి.. కుమార్తె కోసం కొనసాగుతున్న అన్వేషణ
High court of Mumbai : ప్రజాగ్రహంతో కానీ కేసు నమోదు చేయరా?
Delhi : 7 వేల కోట్లతో సైన్యానికి ఆయుధాలు
Read More International News and Latest Telugu News
Updated Date - Aug 23 , 2024 | 01:05 PM