ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Ministry of External Affairs: బంగ్లాదేశ్‌లోని భారతీయులకు కీలక సూచన

ABN, Publish Date - Aug 05 , 2024 | 11:52 AM

పొరుగునున్న బంగ్లాదేశ్‌లో వరుసగా చోటు చేసుకుంటున్న ఉద్రిక్త వాతావరణ పరిస్థితులను భారత్ నిశీతంగా గమనిస్తుంది. బంగ్లాదేశ్‌లో ఆదివారం ఒక్కసారిగా చోటు చేసుకున్న హింసపై భారత్ తనదైనశైలిలో స్పందించింది. అందులోభాగంగా ఆ దేశంలో నివసిస్తున్న భారతీయులకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) కీలక సూచనలు జారీ చేసింది.

న్యూఢిల్లీ, ఆగస్ట్ 05: పొరుగునున్న బంగ్లాదేశ్‌లో వరుసగా చోటు చేసుకుంటున్న ఉద్రిక్త వాతావరణ పరిస్థితులను భారత్ నిశీతంగా గమనిస్తుంది. బంగ్లాదేశ్‌లో ఆదివారం ఒక్కసారిగా చోటు చేసుకున్న హింసపై భారత్ తనదైనశైలిలో స్పందించింది. అందులోభాగంగా ఆ దేశంలో నివసిస్తున్న భారతీయులకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) కీలక సూచనలు జారీ చేసింది.

Also Read: Article 370: అయిదో వార్షికోత్సవం.. బీజేపీ ర్యాలీ.. అమర్నాథ్ యాత్ర నిలిపివేత


రాయబారి కార్యాలయంలో సంప్రదింపులు జరపాలి..

బంగ్లాదేశ్‌లోని భారత రాయబారి కార్యాలయంతో సంప్రదింపులు జరుపుతూ ఉండాలని ఆ దేశంలో నివసిస్తున్న భారతీయులందరికీ సూచించింది. అలాగే తాము తదుపరి నోటీసులు జారీ చేసే వరకు బంగ్లాదేశ్‌లో పర్యటించ వద్దని భారతీయులను ఈ సందర్భంగా హెచ్చరించింది. బంగ్లాదేశ్‌లో ఆందోళనలు నేపథ్యంలో జులై 25వ తేదీన 6,700 మంది భారతీయ విద్యార్థులు స్వదేశానికి తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే.

Also Read: Heavy Rains : అయిదు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్.. పుణెలో నేడు సీఎం పర్యటన.. హిమాచల్‌ప్రదేశ్‌లో కుంభవృష్టి 13 మంది మృతి


కొద్ది రోజుల క్రితమే ఆందోళన మళ్లీ..

దేశంలో రిజర్వేషన్లు సంస్కరించాలంటూ బంగ్లాదేశ్‌లోని యూనివర్సిటీ విద్యార్థులు దేశవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చారు. వీరి ఆందోళనలకు ప్రజలు సైతం మద్దతు తెలిపారు. దీంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలతో తీవ్ర ఉద్రిక్త వాతావరణ నెలకొంది. దాంతో కర్ప్యూ సైతం విధించారు. అలాంటి వేళ... విద్యార్థులను ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. ఆ క్రమంలో పరిస్థితి చక్కబడుతుందని ప్రజలంతా భావించారు.

Also Read: Wayanad Landslides: నాలుగు మృతదేహాలే దొరికాయంటూ మన్సూర్ ఆవేదన


దేశవ్యాప్తంగా కర్ఫ్యూ..

కానీ ఆదివారం మళ్లీ విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. దీంతో విద్యార్థులకు, అధికార హాసీనా పార్టీ మద్దతుదారులకు మధ్య చోటు చేసుకున్న హింసలో 93 మంది మరణించారు. వారిలో 14 మంది పోలీసులు ఉన్నారు. మరోవైపు ఈ హింసలో వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ప్రభుత్వం స్పందించింది. దేశవ్యాప్తంగా కర్ప్యూ విధించింది. అలాగే ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టింది. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పై విధంగా స్పంధించింది.

Also Read: Gold Rates Today: శ్రావణమాసం వచ్చేసింది.. ఇక బంగారానికి ఫుల్ డిమాండ్


మళ్లీ దీదీ స్పందిస్తారా...?

ఇటీవల బంగ్లాదేశ్‌లో జరిగిన హింసతో బాధితులుగా మారిన వారికి తాము ఆశ్రయం కల్పిస్తామని పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ కోల్‌కతాలో ప్రకటించారు. ఈ ప్రకటనపై అధికార బీజేపీ అమిత్ మాలవ్యా ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు.. ఇది కేంద్రం పరిధిలోని అంశమంటూ వ్యాఖ్యానించారు.

అంతేకాదు.. జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం సీఎం మమత ఈ వ్యాఖ్యలు చేశారంటూ ఆయన ఆరోపించారు. అటువంటి పరిస్థితుల్లో మళ్లీ బంగ్లాదేశ్‌లో హింస చెలరేగింది. దీంతో ఈ అంశంపై సీఎం మమత మరోసారి స్పందిస్తారా? లేదా ? ఓ వేళ స్పందిస్తే ఎలా స్పందిస్తారనే అంశంపై ఓ చర్చ సైతం నడుస్తుంది.

Read More National News and Latest Telugu News

Updated Date - Aug 05 , 2024 | 11:55 AM

Advertising
Advertising
<