ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Khamenei: ఇజ్రాయెల్‌ అంతం త్వరలోనే

ABN, Publish Date - Oct 05 , 2024 | 04:57 AM

ఇజ్రాయెల్‌ ఇక ఎంతో కాలం మనుగడ సాగించలేదని, త్వరలోనే అంతం అవుతుందని ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీ హెచ్చరించారు.

  • చేతిలో రైఫిల్‌తో ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ప్రసంగం

  • ఐదేళ్లలో తొలిసారి శుక్రవారం సందేశం ఇచ్చిన అయతుల్లా ఖమేనీ

  • ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ముస్లింలంతా ఏకం కావాలని పిలుపు

టెహ్రాన్‌, టెల్‌ అవీవ్‌, అక్టోబర్‌ 4: ఇజ్రాయెల్‌ ఇక ఎంతో కాలం మనుగడ సాగించలేదని, త్వరలోనే అంతం అవుతుందని ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీ హెచ్చరించారు. టెహ్రాన్‌లోని మొసల్లా మసీద్‌ వద్ద శుక్రవారం ప్రార్ధనల అనంతరం జరిగిన హిజ్బుల్లా చీఫ్‌ నస్రల్లా సంతాప సభలో ఖమేనీ ఇజ్రాయెల్‌పై నిప్పులు కురిపించారు. ఐదేళ్లలో తొలిసారి శుక్రవారం సందేశం ఇచ్చిన ఆయన ఇటీవల ఇజ్రాయెల్‌పై జరిపిన క్షిపణి దాడులను సమర్థించుకున్నారు. 80 ఏళ్ల ఖమేనీ తన చేతిలో రైఫిల్‌ పట్టుకుని ప్రసంగం కొనసాగించారు.


ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తున్న పాలస్తీనా, లెబనాన్‌కు తమ మద్దతు కొనసాగుతుందని పునరుద్ఘాటించారు. హిజ్బుల్లా, హమ్‌సపై ఇజ్రాయెల్‌ ఎప్పటికీ విజయం సాధించలేదని ఆయన జోస్యం చెప్పారు. హిజ్బుల్లా చీఫ్‌ నస్రల్లా బలిదానం వృథా పోదని, నిరంతరం స్ఫూర్తినిస్తూనే ఉంటుందన్నారు. 40 నిమిషాల పాటు ప్రసంగించిన ఖమేనీ ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ముస్లింలంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఆఫ్ఘనిస్థాన్‌నుంచి యెమెన్‌ దాకా అంతా ఒక్కటవ్వాలన్నారు. పశ్చిమాసియా వనరులు, భూములను కాజేసేందుకు అమెరికా ఇజ్రాయెల్‌ను పరికరంగా వాడుకుంటోందని ఆయన ఆరోపించారు. గత ఏడాది అక్టోబర్‌ 7న హమస్‌ ఇజ్రాయెల్‌పై జరిపిన దాడులను కూడా ఖమేనీ సమర్థించారు.


  • ఇజ్రాయెల్‌ ప్రతిదాడి జరిపితే విధ్వంసమే!

అక్టోబర్‌ ఒకటిన తాము జరిపిన క్షిపణి దాడులకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్‌ కనుక ప్రతిదాడి జరిపితే విధ్వంసం తప్పదని ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ హెచ్చరించారు. ఇజ్రాయెల్‌ ప్రతిదాడి చేస్తే తాము ఆ దేశ చమురు కేంద్రాలు, విద్యుత్‌ స్థావరాలపై దాడి చేస్తామని ఐఆర్‌జీసీ డిప్యూటీ కమాండర్‌ అలీ ఫదావీ హెచ్చరించారు. మరోవైపు, వెస్ట్‌బ్యాంక్‌లో ఇజ్రాయిల్‌ జరిపిన వైమానిక దాడుల్లో 18 మంది పాలస్తీనీయులు చనిపోయారు. ఇదిలా ఉండగా, యెమెన్‌లోని హుతీల ప్రధాన స్థావరాలే లక్ష్యంగా అమెరికా వైమానిక దాడులకు దిగింది. ఇంకా కొనసాగుతాయని అధికారులు తెలిపారు.


  • హిజ్బుల్లా కొత్త చీఫ్‌ హతం?

లెబనాన్‌ రాజధాని బీరుట్‌లో జరిపిన వైమానిక దాడిలో హిజ్బుల్లా కొత్త చీఫ్‌ హాషిమ్‌ సఫీద్దీన్‌ హతమైనట్లు ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ ప్రకటించింది. అయితే హిజ్బుల్లా ఈ విషయాన్ని ఇంకా నిర్ధారించలేదు. హిజ్బుల్లా చీఫ్‌ నస్రల్లా హతమయ్యాక హాషిమ్‌ సఫీద్దీన్‌ వారం క్రితమే కొత్త చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు. నస్రల్లాకు దగ్గరి బంధువు కూడా అయిన హాషిమ్‌ సఫీద్దీన్‌ ప్రస్తుతం హిజ్బుల్లా ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ హెడ్‌గా ఉన్నాడు. మరోవైపు గురువారం జరిపిన దాడుల్లో హిజ్బుల్లా కమ్యూనికేషన్‌ విభాగం చీఫ్‌ మహ్మద్‌ రషీద్‌ స్కఫీ హతమైనట్లు ఐడీఎఫ్‌ ప్రకటించింది. మరోవైపు, ఇజ్రాయెల్‌ తాజా వైమానిక దాడులతో లెబనాన్‌-సిరియా సరిహద్దు వద్ద ప్రధాన మార్గం మూసుకుపోయింది. కాగా, లెబనాన్‌లో 4 రోజుల్లో మొత్తం 250 మంది హిజ్బుల్లా ఉగ్రవాదులు హతమయ్యారని ఐడీఎఫ్‌ తెలిపింది.

Updated Date - Oct 05 , 2024 | 04:57 AM