Islamabad : పాక్ ఐఎస్ఐ మాజీ చీఫ్ అరెస్టు
ABN, Publish Date - Aug 13 , 2024 | 06:11 AM
ఐఎస్ఐ మాజీ చీఫ్ జనరల్ ఫయాజ్ హమీద్‌ను పాకిస్థాన్ ఆర్మీ అరెస్టు చేసింది. హౌసింగ్ స్కీమ్ కుంభకోణంలో జరిగిన అవకతవకలకు సంబంధించి ఆయనపై వచ్చిన ఆరోపణల దృష్ట్యా సుప్రీం కోర్టు ఆదేశాలతో అదుపులోకి తీసుకుంది.
ఇస్లామాబాద్, ఆగస్టు 12: ఐఎస్ఐ మాజీ చీఫ్ జనరల్ ఫయాజ్ హమీద్‌ను పాకిస్థాన్ ఆర్మీ అరెస్టు చేసింది. హౌసింగ్ స్కీమ్ కుంభకోణంలో జరిగిన అవకతవకలకు సంబంధించి ఆయనపై వచ్చిన ఆరోపణల దృష్ట్యా సుప్రీం కోర్టు ఆదేశాలతో అదుపులోకి తీసుకుంది. ఈ మేరకు సోమవారం ఐఎ్‌సఐ పబ్లిక్ రిలేషన్స్ విభాగం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘టాప్ సిటీ కేసు(హౌసింగ్ స్కీమ్)లో ఫయాజ్‌పై వచ్చిన ఆరోపణలు నిరూపితం అయ్యాయి. పాక్ ఆర్మీ, సుప్రీం కోర్టు ఆదేశాలతో అదుపులోకి తీసుకున్నాం’’ అని తెలిపింది. 2023 నవంబర్‌లో ఫయాజ్‌పై పిటిషన్ దాఖలైంది.
Updated Date - Aug 13 , 2024 | 08:10 AM