ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

New Zealand: ది గ్రేట్ వైట్ షార్క్ ఎటాక్.. చివరికి యువకుడి పరిస్థితి ఏమైందంటే..

ABN, Publish Date - Nov 19 , 2024 | 06:27 PM

న్యూజిలాండ్‌లోని మారుమూల ప్రాంతమైన చాతం దీవులకు జేడ్ కహుకోర్ డిక్సన్ అనే 24 ఏళ్ల యువకుడు కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లాడు. ఓ పడవ తీసుకుని అంతా కలిసి సముద్రంలోకి వెళ్లారు.

ఇంటర్నెట్ డెస్క్: సముద్రంలో అత్యంత ప్రమాదకరమైన జీవుల్లో షార్క్‌లు ఒకటి. దాని నోటికి చిక్కిన ప్రతి జీవిని అది రంపం పళ్లతో ముక్కలు ముక్కలు చేస్తూ అమాంతం మింగేస్తుంటుంది. షార్క్‌లు దాడి చేయడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. పైగా అవి సంచరించే ప్రదేశాల్లో పర్యాటకులను అధికారులు అనుమతించరు. అయితే కొన్నికొన్ని దేశాల్లో మాత్రం పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉంటాయి. ముఖ్యంగా ఐరోపా దేశాల్లో షార్క్‌లు తరచూ మనుషులపై దాడులు చేస్తుంటాయి. కొన్నిసార్లు చిన్నచిన్న గాయాలతో బయటపడితే, మరికొన్ని సార్లు ప్రాణాలు పోయే పరిస్థితులు ఏర్పడతాయి. వీటిపై సినిమాలు సైతం తీశారంటే షార్క్ దాడి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అయితే తాజాగా అలాంటి ఘటనే ఒకటి న్యూజిల్యాండ్‌లో చోటు చేసుకుంది.


న్యూజిలాండ్‌లోని మారుమూల ప్రాంతమైన చాతం దీవులకు జేడ్ కహుకోర్ డిక్సన్ అనే 24 ఏళ్ల యువకుడు కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లాడు. ఓ పడవ తీసుకుని అంతా కలిసి సముద్రంలోకి వెళ్లారు. అందరూ కలిసి సరదాగా ఈత కొడుతూ సందడిగా గడుపుతున్నారు. అయితే అక్కడ వారికి అనుకోని అథితి ఒకరు ఎదురయ్యారు. వీరంతా సంతోషంగా గడుపుతున్న సమయంలో ది గ్రేట్ వైట్ షార్క్ అక్కడికి వచ్చింది. అదే సమయంలో పడవ నుంచి డిక్సన్ డైవ్ చేసి సముద్రం లోపలికి వెళ్లాడు. దీంతో అతన్ని ఆహారంగా భావించిన సొర చేప యువకుడిపై దాడి చేసింది. దీంతో యువకుడికి తీవ్రగాయాలు అయ్యాయి. ఇంతలో అందరూ కలిసి అతన్ని పడవలోకి ఎక్కించారు. దాడి ఘటనతో అంతా దిగ్ర్భాంతికి గురయ్యారు. వెంటనే తేరుకుని ఎమర్జెన్సీ సర్వీసెస్‌కి సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న అధికారులు.. డిక్సన్‌ను వెంటనే దీవుల్లోని ఓ ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్సపొందుతూ డిక్సన్ మృతిచెందాడు. ఈ ఘటన నవంబర్ 19న జరిగింది.


ఈ ప్రాంతానికి తాము తరచుగా వస్తామని, తన కుమారుడికి సొర చేపలంటే భయం లేదని డిక్సన్ తండ్రి జాకీ డిక్సన్ తెలిపారు. కుటుంబాన్ని కాపాడేందుకు తన కుమారుడు ఎంతకైనా తెగిస్తాడని, అతనో మంచి వ్యక్తి అంటూ యువకుడి తండ్రి కన్నీటి పర్యంతం అయ్యాడు. కుమారుడి మృతిని ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని ఆయన చెప్పారు. అయితే న్యూజిలాండ్‌లో 2021 తర్వాత జరిగిన మొదటి ప్రాణాంతక షార్క్ దాడి ఇదేనని స్థానిక అధికారులు చెప్తున్నారు.19 ఏళ్ల కైలా మార్లో నార్త్ ఐలాండ్‌లోని వైహి బీచ్‌లో సొరచేప దాడిలో ప్రాణాలు కోల్పోయారని, ఆ తర్వాత ఇప్పడు మళ్లీ మరో వ్యక్తి మృతి చెందారని చెబుతున్నారు. 1860 నుంచి న్యూజిలాండ్‌లో షార్క్ దాడులకు ఇప్పటివరకూ 29 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు వెల్లడించారు.


అయితే ది గ్రేట్ వైట్ షార్క్‌లు మనుషులపై చాలా అరుదుగా దాడి చేస్తాయని అంతర్జాతీయ షార్క్ అటాక్ ఫైల్ (ISAF) నివేదికలు చెబుతున్నాయి. ఐఎస్ఏఎఫ్ నివేదికల ప్రకారం సంవత్సరానికి సగటున కేవలం ఆరుగురు మాత్రమే షార్క్ దాడుల్లో ప్రాణాలు కోల్పోతున్నారని తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 2023లో 14 మంది చనిపోయారని, 2022లో తొమ్మది మంది మాత్రమే షార్క్ దాడుల్లో మరణించారని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అయితే షార్క్‌లు మనుషులను తమ ఆహారంగా పొరపడడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతాయని రిపోర్టులు చెబుతున్నాయి.

Updated Date - Nov 19 , 2024 | 06:27 PM