Japan PM: పదవి నుంచి వైదొలుగుతున్న జపాన్ ప్రధాని
ABN, Publish Date - Aug 14 , 2024 | 06:34 PM
జపాన్ ప్రధానమంత్రి ఫుమియో కిషిద సంచలన ప్రకటన చేశారు. ప్రధాని పదవి నుంచి తాను వైదొలగనున్నట్టు బుధవారంనాడిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు. వచ్చే నెలలో జరిగే అధికారిక లిబరల్ డెమోక్రటిక్ పార్టీ ఎన్నికల్లో సైతం తాను పోటీ చేయడం లేదని వెల్లడించారు.
టోక్యో: జపాన్ (Japan) ప్రధానమంత్రి ఫుమియో కిషిద (Fumio Kishida) సంచలన ప్రకటన చేశారు. ప్రధాని పదవి నుంచి తాను వైదొలగనున్నట్టు బుధవారంనాడిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు. వచ్చే నెలలో జరిగే అధికారిక లిబరల్ డెమోక్రటిక్ పార్టీ (Liberal Democractic party) ఎన్నికల్లో సైతం తాను పోటీ చేయడం లేదని వెల్లడించారు.
"వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో నేను నిలబడటం లేదు. ఈ ఎన్నికల్లో ప్రజలకు ఎల్‌డీపీ మారిందని, ఇప్పుడున్నది సరికొత్త పార్టీ అని తెలియజేయాలి. ఇందుకోసం స్వేచ్ఛగా, పారదర్శకంగా ఎన్నికలు జరగాలి. ఇందుకోసం వేరేవారికి పార్టీ పగ్గాలు అప్పగించడం చాలా ముఖ్యం. ఇందుకోసం నా అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకుంటున్నాను'' అని కిషిద తెలిపారు. వేతనాల పెంపు, ఎనర్జీ పాలసీ, జపాన్ రక్షణ సామర్థ్యం పెంచడం సహా తమ ప్రభుత్వం అనేక విజయాలను సాధించిందన్నారు. కొత్త నాయకుడికి తమ పూర్తిస్థాయి మద్దతు ఉంటుందని కూడా ఆయన ప్రకటించారు.
Thailand PM: థాయ్‌లాండ్ ప్రధానిని పదవి నుంచి తొలగించిన కోర్టు
కాగా, 2021లో ప్రధానమంత్రిగా కిషిద పగ్గాలు చేపట్టారు. అయితే ఎల్డీపీలో పొలిటికల్ ఫండింగ్ స్కామ్ చోటుచేసుకోవడంతో ఆయన పదవి నుంచి వైదొలగాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. అయితే కిషిద పదవి నుంచి వైదొలగనున్నట్టు చేసిన ప్రకటనపై ఎల్‌డీపీ సీనియర్ నేత ఒకరు మాట్లాడుతూ, అపరిష్కృతం కాని సమస్యల కారణంగానే కిషిద రాజీనామా చేస్తు్న్నారనే వార్తలు పూర్తిగా బాధ్యతారాహిత్యంతో కూడుకున్నవని, పదవిలో కొనసాగాల్సిందిగా తాము ఆయనను కోరుతామని చెప్పారు.
Updated Date - Aug 14 , 2024 | 06:34 PM