ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Joe Biden: అమెరికా ఎన్నికల ఫలితాలపై అధ్యక్షుడు జో బైడెన్ తొలిసారి స్పందన.. ట్రంప్‌కు ఓ సలహా

ABN, Publish Date - Nov 08 , 2024 | 07:57 AM

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో్ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ గెలుపు తర్వాత తొలిసారి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. శాంతియుతంగా అధికార మార్పిడికి అధ్యక్షుడు హామీ ఇచ్చారు. ‘‘ప్రజలు ఓటు వేసి అధ్యక్షుడిని ఎన్నుకున్నారు.

Joe Biden

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ గెలుపు తర్వాత ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ తొలిసారి స్పందించారు. శాంతియుతంగా అధికార మార్పిడికి ఆయన హామీ ఇచ్చారు. ‘‘ప్రజలు ఓటు వేసి అధ్యక్షుడిని ఎన్నుకున్నారు. శాంతియుతంగా ఈ ప్రక్రియను ముగించారు. ప్రజాస్వామ్యంలో ప్రజల సంకల్పం ఎల్లప్పుడూ శక్తివంతమైనది. అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్‌తో నిన్న మాట్లాడి అభినందనలు తెలిపాను. శాంతియుతంగా, క్రమబద్ధమైన రీతిలో అధికార మార్పిడి విషయంలో ట్రంప్ బృందంతో కలిసి పనిచేయడానికి నా పాలనా యంత్రాంగాన్ని నిర్దేశిస్తానని ట్రంప్‌కు హామీ ఇచ్చాను. అమెరికా ప్రజలు దీనికి పూర్తిగా అర్హులు’’ అని జో బైడెన్ వ్యాఖ్యానించారు.


గెలిచినప్పుడు మాత్రమే దేశాన్ని ప్రేమించడం కాదని, సమ్మతమైనప్పుడు మాత్రమే పొరుగువారిని ప్రేమించడం సరికాదని డొనాల్డ్ ట్రంప్‌కు జో బైడెన్ సలహా ఇచ్చారు. ఎవరు ఎవరికి ఓటు వేసినా.. ఒకరినొకరు విరోధులుగా చూసుకోవద్దని, తోటి అమెరికన్లుగా భావించాలని అన్నారు. అమెరికన్ల నుంచి తాను దీనిని ఆశిస్తున్నట్టు చెప్పారు. ఈ విషయాన్ని ఇదివరకు చాలాసార్లు చెప్పానని బైడెన్ గుర్తుచేశారు. ఈ మేరకు వైట్‌హౌస్ నుంచి అమెరికా ప్రజలను ఉద్దేశించి బైడెన్ గురువారం మాట్లాడారు. తన ట్రేడ్‌మార్క్ బ్లూ సూట్, తెల్లటి చారల టైతో ధరించి ఆయన కనిపించారు.


కమలా హారిస్‌తో మాట్లాడాను..

ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌తో కూడా తాను మాట్లాడానని అధ్యక్షుడు జో బైడెన్ చెప్పారు. ఆమె ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా పనిచేశారని, ప్రజా సేవకురాలు అని బైడెన్ కొనియాడారు. ఈ ఎన్నికల్లో ఆమె స్ఫూర్తిదాయకంగా పోరాడారని మెచ్చుకున్నారు. ‘‘కొన్నాళ్లుగా నేను చూస్తున్న ఆమె వ్యక్తిత్వాన్ని మీరందరు కూడా చూడగలిగారు. ఎన్నికల్లో మనస్ఫూర్తిగా కష్టపడాల్సినంతగా కమలా కృషి చేశారు. ఈ ఎన్నికల్లో పోరాడిన విధానానికి ఆమెతో పాటు టీమ్ మొత్తం గర్వపడాలి’’ అని బైడెన్ కొనియాడారు.


తీర్పుని గౌరవించాలి...

దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘‘కొంతమందికి ఇది విజయం, వేడుకల సమయం అని నాకు తెలుసు. మరికొందరికి ఇది ఓటమి, నిరాశ కలిగించే సమయం కావచ్చు. కానీ ప్రజలు ఎవరో ఒకర్ని మాత్రమే ఎన్నుకుంటారు. దేశం ఎంచుకున్నవారిని మనమందరం అంగీకరించాలి’’ అని బైడెన్ అన్నారు. అమెరికా ఎన్నికల వ్యవస్థపై మాట్లాడుతూ.. సమగ్రత కలిగిన వ్యవస్థ అని విశ్వాసం వ్యక్తం చేశారు. న్యాయబద్ధంగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తుందని అన్నారు. ‘‘ఎన్నికల్లో గెలిచినా ఓడినా ఎన్నికల కార్యకర్తలందరికీ గౌరవాన్ని ఇవ్వాలని ఆశిస్తున్నాను. వారికి మనం కృతజ్ఞతలు చెప్పాలి’’ అని జో బైడెన్ వ్యాఖ్యానించారు.


ముగింపులో ఏమన్నారంటే..

ప్రజలు పౌరులుగా తమ కర్తవ్యాన్ని నిర్వర్తించారని, ఇప్పుడు తాను అధ్యక్షుడిగా బాధ్యతను నిర్వర్తిస్తానని బైడెన్ అన్నారు. తన చేసిన ప్రమాణం ప్రకారం రాజ్యాంగాన్ని గౌరవిస్తానని, జనవరి 20, 2025న శాంతియుతంగా అధికార బదిలీ చేస్తానని అన్నారు. ‘‘అద్భుతమైన సిబ్బందికి, మద్దతుదారులకు, క్యాబినెట్ సభ్యులు అందరికీ ధన్యవాదాలు. గత 40 ఏళ్లుగా నాతో ఉన్న ప్రజలందరినీ నేను నిన్ను ప్రేమిస్తున్నానని దేవుడికి తెలుసు. మీ అందరికీ ధన్యవాదాలు. మీరు చాలా కష్టపడ్డారు. ఈ నాలుగేళ్ల బాగా పనిచేసి కష్టపడ్డారు. మీ కృషితోనే నేను ప్రెసిడెండ్‌ని అయ్యాను’’ అంటూ జో బైడెన్ తన ప్రసంగాన్ని ముగించారు.

Updated Date - Nov 08 , 2024 | 08:03 AM