ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kiev : ఉక్రెయిన్‌ శాంతి సదస్సు భారత్‌లో!

ABN, Publish Date - Aug 26 , 2024 | 05:45 AM

ఉక్రెయిన్‌లో శాంతి స్థాపన లక్ష్యంగా రెండో విడత అంతర్జాతీయ శాంతి సదస్సుకు భారత్‌ ఆతిథ్యమివ్వాలని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రతిపాదించారు.

  • మోదీకి జెలెన్‌స్కీ ప్రతిపాదన

కీవ్‌, ఆగస్టు 25: ఉక్రెయిన్‌లో శాంతి స్థాపన లక్ష్యంగా రెండో విడత అంతర్జాతీయ శాంతి సదస్సుకు భారత్‌ ఆతిథ్యమివ్వాలని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రతిపాదించారు. ఇటీవల తనని కలిసిన ప్రధాని మోదీ వద్ద ఈ అంశాన్ని ప్రస్తావించానని జెలెన్‌స్కీ విలేకరులకు వెల్లడించారు.

అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌ ఈ సదస్సు నిర్వహణకు తగిన ప్రాంతమని అభిప్రాయపడ్డారు. అలాగే, భారత్‌తోపాటు సౌదీ అరేబియా, ఖతార్‌, తుర్కియే, స్విట్జర్లాండ్‌ దేశాలను కూడా సదస్సు నిర్వహణకు పరిగణనలోకి తీసుకుంటున్నామని చెప్పారు.

కాగా, తొలి విడత ఉక్రెయిన్‌ శాంతి సదస్సు జూన్‌లో స్విట్జర్లాండ్‌లో జరిగింది. 60 దేశాల అధినేతలు హాజరయ్యారు. భారత్‌ నుంచి విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి మాత్రమే ఈ సదస్సులో పాల్గొన్నారు.

Updated Date - Aug 26 , 2024 | 05:46 AM

Advertising
Advertising
<