ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

UK Elections 2024: యూకే ఎన్నికల్లో లేబర్ పార్టీ గ్రాండ్ విక్టరీ.. రిషి సునాక్ పార్టీ..

ABN, Publish Date - Jul 05 , 2024 | 09:56 AM

బ్రిటిష్ సార్వత్రిక ఎన్నికల్లో(UK Elections 2024) ప్రస్తుత ప్రధాని రిషి సునాక్(rishi sunak) ఘోర పరాజయాన్ని చవిచూశారు. ఈ క్రమంలో లేబర్ పార్టీకి చెందిన కైర్ స్టార్మర్(keir starmer) పార్టీ భారీ విజయం సాధించింది.

Labor Party Victory in UK Elections 2024

బ్రిటిష్(britain) సార్వత్రిక ఎన్నికల్లో(UK Elections 2024) ప్రస్తుత ప్రధాని రిషి సునాక్(rishi sunak) ఘోర పరాజయాన్ని చవిచూశారు. ఈ క్రమంలో లేబర్ పార్టీకి చెందిన కైర్ స్టార్మర్(keir starmer) పార్టీ భారీ విజయం సాధించింది. 650 సీట్లున్న పార్లమెంట్‌లో లేబర్ పార్టీ ఇప్పటివరకు 341 సీట్లకు పైగా గెల్చుకున్నారు. దీంతో కన్జర్వేటివ్ పార్టీ నేతృత్వంలోని 14 ఏళ్ల ప్రభుత్వ పాలనకు తెరపడింది. జూలై 4న జరిగిన ఓటింగ్ ఫలితాలు ఈరోజు ఉదయం వెలువడ్డాయి. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 326 సీట్లు వస్తే సరిపోతుంది. దీంతో లేబర్ పార్టీకి చెందిన నేత కీర్ స్టార్మర్ బ్రిటన్ తదుపరి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు.


ఇక భారత సంతతికి చెందిన కన్జర్వేటివ్ పార్టీ రిషి సునాక్‌కు ఇప్పటివరకు 72 సీట్లు మాత్రమే వచ్చాయి. సునాక్ తన రిచ్‌మండ్, నార్తలెర్టన్ స్థానాలను గెలుచుకున్నారు. లేబర్ పార్టీ PM అభ్యర్థి కైర్ స్టార్మర్ లండన్‌లోని హోల్‌బోర్న్, సెయింట్ పాన్‌క్రాస్ స్థానాలను కూడా గెలిచారు. ఫలితాలు ప్రకటించిన తర్వాత, సునాక్ తన ఓటమిని అంగీకరించారు. బ్రిటన్ ప్రజలు వారి తీర్పును ఇచ్చారని, దాని నుంచి చాలా నేర్చుకోవాల్సి ఉందని సునాక్ అన్నారు. దీనికి బాధ్యత వహిస్తానని, కష్టపడి పనిచేసిన పార్టీ కార్యకర్తలు, నాయకులకు ఈ సందర్భంగా క్షమాపణలు చెప్పారు. ఈ క్రమంలోనే స్టార్మర్‌కు ఫోన్ చేసి విజయంపై అభినందనలు తెలియజేశారు.

2019లో 67.3% ఓటింగ్ నమోదైంది. అప్పుడు సునాక్ కన్జర్వేటివ్ పార్టీకి 365 సీట్లు, కైర్ స్టార్మర్స్ లేబర్ పార్టీకి 202 సీట్లు, లిబరల్ డెమోక్రాట్లకు 11 సీట్లు వచ్చాయి. ఈసారి దాదాపుగా అన్ని సర్వేలు కన్జర్వేటివ్ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూశాయి. YouGov సర్వేలో, లేబర్ పార్టీకి 425 సీట్లు, కన్జర్వేటివ్‌లకు 108, లిబరల్ డెమోక్రాట్‌లకు 67, SNPకి 20 సీట్లు వస్తాయని అంచనా వేసింది.


ఇది కూడా చదవండి:

UK: యూకే ఎన్నికల్లో ఈ పార్టీదే ఆధిపత్యం.. ఎగ్జిట్ పోల్స్ వెల్లడి

చాంపియన్లతో సందడే సందడి..!


మార్కెట్‌ దూసుకెళ్తోంది.. జర జాగ్రత్త!


Read Latest International News and Telugu News

Updated Date - Jul 05 , 2024 | 11:38 AM

Advertising
Advertising