ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Modi visits Atom Centre: పుతిన్‌తో అణుకేంద్రాన్ని సందర్శించిన మోదీ

ABN, Publish Date - Jul 09 , 2024 | 05:35 PM

రష్యాలో భారత ప్రధానమత్రి నరేంద్ర మోదీ రెండ్రోజుల పర్యటన కొనసాగుతోంది. ఇందులో భాగంగా మాస్కోలోని అణుకేంద్రాన్ని ఆ దేశాధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్‌ తో కలిసి మోదీ మంగళవారంనాడు సందర్శించారు.

మాస్కో: రష్యా(Russia)లో భారత ప్రధానమత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) రెండ్రోజుల పర్యటన కొనసాగుతోంది. ఇందులో భాగంగా మాస్కో (Moscow)లోని అణుకేంద్రాన్ని (Atom centre) ఆ దేశాధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్‌ (Vladimir Putin)తో కలిసి మంగళవారంనాడు మోదీ సందర్శించారు. అణు సహకారం (Nuclear cooperation), సైంటిఫిక్స్ అడ్వాన్స్‌మెంట్‌ సహా వివిధ రంగాల్లో ఇరుదేశాల మధ్య భాగస్వామ్యం కీలకంగా ఉన్న తరుణంలో మోదీ మాస్కో పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. మాస్కో శివార్లరో ఉన్న ఈ అణుకేంద్ర రష్యా న్యూక్లియర్ టెక్నాలజీ అండ్ ఇన్నొవేషన్‌కు కీలకంగా నిలుస్తోంది. పరిశోధన, అభివృద్ధి, న్యూక్లియర్ సైన్సెస్‌లో ఎడ్యుకేషన్‌‌కు ఒక హబ్‌గా ఈ అణుకేంద్రం నిలుస్తోంది. ఆటమిక్ ఎనర్జీ కేవలం శాంతియుత ప్రయోజనాల కోసమే వినియోగించాలనే రష్యా కమిట్‌మెంట్‌ను చాటుతోంది.


అణురంగంలో పరస్పర సహకారానికి సంబంధించిన రష్యా-భారత్ మధ్య సుదీర్ఘ చరిత్ర ఉంది. కుడాంకులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌ ఏర్పాటుకు ముందు నుంచే ఈ సహకారం కొనసాగుతోంది. పరస్పర విశ్వాసం, సాంకేతక సహకారం, సంయుక్త వెంచర్లతో రష్యా-భారత్ మధ్య కొనసాగుతున్న భాగస్వామ్యం భారతదేశ ఇంధన అవసరాలు, టెక్నాలజీ అడ్వాన్‌‌మెంట్‌లో గణనీయ పాత్ర పోషిస్తోంది.

Modi-Putin: ఇదో వినాశకరమైన దెబ్బ.. మోదీ-పుతిన్ ఆలింగనంపై జెలెన్‌స్కీ ఫైర్


మోదీ ట్వీట్..

ప్రెసిడెంట్ పుతిన్‌తో కలిసి ఆటమ్ పెవెలియన్‌ను సందర్శించినట్టు మోదీ ఒక ట్వీట్‌లో తెలిపారు. ''ఇండియా-రష్యాల మధ్య సహకారానికి ఇంధనం (ఎనర్జీ) అనేది కీలకంగా నిలుస్తోంది. ఈ రంగంలో మరింత పటిష్ట సంబంధాల కోసం ఇరుదేశాలు ఆసక్తిగా ఉన్నాం'' అని మోదీ ట్వీట్ చేశారు.

Read Latest International News and Telugu News

Updated Date - Jul 09 , 2024 | 05:38 PM

Advertising
Advertising
<