ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పథకం ప్రకారమే హసీనాకు ఉద్వాసన

ABN, Publish Date - Sep 27 , 2024 | 03:50 AM

బంగ్లాదేశ్‌లో షేక్‌ హసీనా ప్రభుత్వ పతనానికి కారణమైన ఇటీవలి ఆందోళనల వెనుక ఉన్న ‘సూత్రధారుల’ను ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వ సారధి మొహమ్మద్‌ యూనస్‌ ప్రపంచానికి పరిచయం చేశారు.

  • అది యాదృచ్ఛికంగా వచ్చిన తిరుగుబాటు కాదు.. పక్కా ప్రణాళికతోనే బంగ్లాదేశ్‌లో ఆందోళనలు

  • సూత్రధారులను పరిచయం చేసిన తాత్కాలిక ప్రభుత్వ సారథి యూనస్‌

న్యూఢిల్లీ, సెప్టెంబరు 26: బంగ్లాదేశ్‌లో షేక్‌ హసీనా ప్రభుత్వ పతనానికి కారణమైన ఇటీవలి ఆందోళనల వెనుక ఉన్న ‘సూత్రధారుల’ను ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వ సారధి మొహమ్మద్‌ యూనస్‌ ప్రపంచానికి పరిచయం చేశారు. అవి పక్కా ప్రణాళికతో నిర్వహించిన ఆందోళనలని, అదో క్రమశిక్షణతో కూడిన తిరుగుబాటు అని యూనస్‌ వెల్లడించారు. ఏ ఒక్కరినో నాయకుడిగా గుర్తించడానికి లేదా అరెస్టు చేయడానికి అవకాశమే లేకుండా నిర్వహించడం వల్ల ఆ ఆందోళనలు మరింత శక్తిమంతంగా మారాయని పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ 79వ సమావేశాల్లో పాల్గొనేందుకు అమెరికా వెళ్లిన ఆయన అక్కడ క్లింటన్‌ గ్లోబల్‌ ఇనీషియేటివ్‌ కార్యక్రమంలో ప్రసంగించారు.

ఇటీవలి బంగ్లాదేశ్‌ ఆందోళనలను ఆయన ఆ కార్యక్రమంలో ప్రస్తావించారు. అవి యాధృచ్ఛికంగా జరిగిన ఆందోళనలు కావని, అవి ఎంతో జాగ్రత్తగా రూపొందించిన ఆందోళనలని యూనుస్‌ తెలిపారు. ఢాకా ట్రైబ్యున్‌ పత్రిక కథనం మేరకు తన ప్రత్యేక సహాయకుడు మహఫూజ్‌ ఆలంను ఆ కార్యక్రమంలో యూనస్‌ పరిచయం చేశారు. ‘మేం సంయుక్తంగా తీసుకున్న బాధ్యత ఇది. ఆ ఆందోళనల్లో వారు ఇతర యువకుల్లాగే కనిపిస్తారు. మీరు వారిని గుర్తించలేరు. అయితే, వారు కార్యాచరణకు దిగినప్పుడు మీరు గనుక చూశారంటే, వారు మాట్లాడినప్పుడు మీరు విన్నారంటే షాక్‌కు గురవుతారు. వారు తమ ప్రసంగాలు, అంకితభావం, నిబద్ధత ద్వారా దేశం మొత్తాన్ని కదిలించారు.

ఈయననే ఆ మొత్తం ఆందోళనల వెనుక సూత్రధారిగా భావిస్తున్నారు. ఈయన మాత్రం తాను కాదని, వేరే చాలా మంది ఉన్నారనే పదేపదే అంటున్నారు. ఆ విధంగా ఆయన అంతా పకడ్బందీగా నిర్వహించారు. అది అకస్మాత్తుగా వచ్చిన ఆందోళన కాదు. పక్కాగా, చాలా జాగ్రత్తగా రూపొందించిన ఆందోళన. నాయకత్వ బాధ్యతల్లో ఉన్నవారికి కూడా నాయకుడెవరూ తెలియలేదు. అదో అద్భుతం.

ప్రపంచంలో ఎక్కడైనా సరే, వారు మాట్లాడే భాష ఏ ప్రాంతంలోనైనా, ఏ యువతకైనా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. వారే వీరు. వీరిని చప్పట్లతో అభినందించండి. వీరు కొత్త బంగ్లాదేశ్‌ను సృష్టిస్తున్నారు. వీరి ప్రయత్నం విజయవంతమవ్వాలని ఆకాంక్షిద్దాం’ అని యూనుస్‌ తెలిపారు. ఉద్యోగాల్లో రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు తీవ్రరూపం దాల్చడంతో నాటి ప్రధానమంత్రి హసీనా ఆగస్టు 5న బంగ్లాదేశ్‌ను వీడి భారతదేశానికి పరారైన విషయం తెలిసిందే.

Updated Date - Sep 27 , 2024 | 03:50 AM