ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Gaza: గాజాలో ముంచుకొస్తున్న కరవు.. 30 వేలు దాటిన మృతులు..

ABN, Publish Date - Feb 29 , 2024 | 05:29 PM

పాలస్తీనా, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి గాజాలో పరిస్థితులు దయనీయంగా మారాయి. బాంబు దాడులు, పేలుళ్లు, ఆహార కొరత, ఆకలి మాంద్యంతో ఇప్పటివరకు

పాలస్తీనా, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి గాజాలో పరిస్థితులు దయనీయంగా మారాయి. బాంబు దాడులు, పేలుళ్లు, ఆహార కొరత, ఆకలి మాంద్యంతో ఇప్పటివరకు 30 వేల మందికి పైగా మృత్యువాత పడినట్లు హమాస్ నేతృత్వంలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరికొద్ది రోజుల్లో ఇజ్రాయెల్, హమాస్ మధ్య సంధి ఒప్పందం జరగవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. గాజా నగరంలోని అల్-షిఫా ఆసుపత్రిలో పౌష్టికాహార లోపం కారణంగా పిల్లలు మరణించారు. ప్రస్తుతం గాజాలో జీవనం అంటే జీవన్మరణ సమస్యగా మారింది. ఈజిప్ట్, ఖతార్, యునైటెడ్ స్టేట్స్ నుంచి కొందరు మధ్యవర్తులు యుద్ధానికి ఆరు వారాల విరామం కోరుతున్నారు,

Telangana: ధరణి మార్గదర్శకాలు విడుదల.. కీలక బాధ్యతలన్నీ కలెక్టర్లకే..

Telangana: బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. ఎంపీ రాజీనామా.. ఆ పార్టీలో చేరిక..

మార్చి 10 లేదా 11 నుంచి పవిత్ర ముస్లిం మాసం రంజాన్ ప్రారంభం కానుంది. ఇజ్రాయెల్ చేతిలో ఉన్న వందల మంది పాలస్తీనియన్ ఖైదీలకు బదులుగా గాజాలో ఉన్న కొంతమంది ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయాలని ప్రతిపాదనలు వచ్చాయి. యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రయత్నాలు చేస్తున్నట్లు విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ తెలిపారు. గాజాలో ఇజ్రాయెల్ ప్రతీకార సైనిక చర్యల కారణంగా వేల మంది నిర్వాసితులయ్యారు. యుద్దం కారణంగా ప్రపంచ దేశాలతో సంబంధం తెగిపోయింది. ఆహారం కొరత ఏర్పడి ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు.

మరిన్ని అంతర్జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 29 , 2024 | 05:29 PM

Advertising
Advertising