Earthquakes: 24 గంటల్లోనే 80కి పైగా భూకంపాలు..కూప్పకూలిన భవనాలు
ABN, Publish Date - Apr 23 , 2024 | 08:24 AM
తైవాన్(Taiwan)లో ఈ నెలలో మరోసారి భారీ భూకంపం సంభవించింది. సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల మధ్య దేశంలోని తూర్పు తీరంలో 80కి పైగా భూ ప్రకంపనలు(Earthquakes) సంభవించాయి. వీటిలో అత్యధిక తీవ్రత 6.3, 6గా నమోదైంది. భారత కాలమానం ప్రకారం ఈ రెండు రాత్రి 12 గంటల సమయంలో కొన్ని నిమిషాల వ్యవధిలోనే సంభవించాయి.
తైవాన్(Taiwan)లో ఈ నెలలో మరోసారి భారీ భూకంపం(earthquake) సంభవించింది. సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల మధ్య దేశంలోని తూర్పు తీరంలో 80కి పైగా భూ ప్రకంపనలు(Earthquakes) సంభవించాయి. వీటిలో అత్యధిక తీవ్రత 6.3, 6గా నమోదైంది. భారత కాలమానం ప్రకారం ఈ రెండు రాత్రి 12 గంటల సమయంలో కొన్ని నిమిషాల వ్యవధిలోనే సంభవించాయి.
హువాలియన్(Hualien) తూర్పు కౌంటీలో భూమికి 5.5 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. భూకంపం ధాటికి హువాలియన్‌లోని పలు భవనాలు దెబ్బతిన్నాయి. ఈ క్రమంలో జపాన్, చైనా, ఫిలిప్పీన్స్‌లో కూడా తేలికపాటి ప్రకంపనలు సంభవించాయి. ప్రస్తుతం ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లినట్లు సమాచారం అందలేదు.
ఏప్రిల్ 3న తైవాన్‌లో 7.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. అప్పుడు 14 మంది మరణించారు. ఆ సమయంలో కూడా హువాలియన్(Hualien) నగరంలోనే భూకంపం సంభవించింది. దీని కేంద్రం భూమికి 34 కిలోమీటర్ల దిగువన ఏర్పడింది. భారత కాలమానం ప్రకారం ఉదయం 5:30 గంటలకు భూకంపం సంభవించింది. అనేక భవనాలు నేలకూలాయి, ల్యాండ్ స్లైడ్లు కూడా సంభవించాయి. అప్పటి నుంచి తైవాన్‌ను అనేక భూకంపాలు అతలాకుతలం చేస్తున్నాయి. తైవాన్ రెండు టెక్టోనిక్ ప్లేట్ల జంక్షన్ వద్ద ఉన్న దేశం. ఇది భూకంపాలకు సున్నితంగా పరిగణించబడుతుంది.
2016లో దక్షిణ తైవాన్‌లో సంభవించిన భూకంపంలో 100 మందికి పైగా మరణించారు. అంతకుముందు 1999లో 7.3 తీవ్రతతో సంభవించిన భూకంపంలో 2,000 మందికి పైగా మరణించారు. ప్రతి సంవత్సరం ప్రపంచంలో అనేక భూకంపాలు సంభవిస్తాయి. కానీ వాటి తీవ్రత తక్కువగా ఉంటుంది. జాతీయ భూకంప సమాచార కేంద్రం ప్రతి సంవత్సరం 20,000 భూకంపాలను నమోదు చేస్తుంది. వీటిలో 100 భూకంపాలు ఎక్కువ నష్టం కలిగించేవి. భూకంపం కొన్ని సెకన్లు లేదా కొన్ని నిమిషాల పాటు ఉంటుంది. 2004లో హిందూ మహాసముద్రంలో చరిత్రలో అత్యంత సుదీర్ఘమైన భూకంపం సంభవించింది. ఈ భూకంపం 10 నిమిషాల పాటు కొనసాగింది.
ఇది కూడా చదవండి:
IMD: దేశంలో మరో 5 రోజులు మండే ఎండలు..ఈ ప్రాంతాలకు అలర్ట్
CIBIL Score: ఈ తప్పులు చేస్తున్నారా.. మీ సిబిల్ స్కోర్ ఖతం
Read Latest International News and Telugu News
Updated Date - Apr 23 , 2024 | 08:27 AM