Mystery Drones: అమెరికా గగనతలంలో ‘మిస్టరీ డ్రోన్లు’
ABN, Publish Date - Dec 15 , 2024 | 04:29 AM
అమెరికా గగనతలంలో పలు చోట్ల ‘మిస్టరీ డ్రోన్లు’ దర్శనమిస్తుండడం కలవరం సృష్టిస్తోంది.
రాత్రి వేళల్లో దర్శనం.. కూల్చివేయాలన్న ట్రంప్
వాషింగ్టన్, డిసెంబరు 14: అమెరికా గగనతలంలో పలు చోట్ల ‘మిస్టరీ డ్రోన్లు’ దర్శనమిస్తుండడం కలవరం సృష్టిస్తోంది. వీటిని ఇరానో, చైనానో ప్రయోగించి ఉంటాయని కొందరు భావిస్తుండగా, ప్రభుత్వ వర్గాలు మాత్రం అలాంటిదేమీ లేదని కొట్టిపారేస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం న్యూజెర్సీలో ఈ అనుమానాస్పద డ్రోన్లు కనిపించాయి. ప్రస్తుతం న్యూయార్క్ నగరం సహా ఇతర రాష్ట్రాల్లోనూ రాత్రి వేళల్లో ఇవి దర్శనమిస్తున్నాయి. ప్రకాశవంతమైన వస్తువులు ఎగురుతున్నట్టుగా కనిపిస్తుండడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై శ్వేత సౌధం స్పందిస్తూ వీటి వల్ల జాతీయ భద్రతకు ముప్పులేదని, వీటి వెనుక విదేశీ హస్తం కూడా లేదని తెలిపింది. అధ్యక్షుడిగా ఎన్నికయిన డొనాల్డ్ ట్రంప్ మాత్రం వీటిని కూల్చివేయాలని డిమాండ్ చేశారు.
Updated Date - Dec 15 , 2024 | 04:29 AM