ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Bangladesh crisis: ప్రధానినే గద్దె దింపిన 26 ఏళ్ల యువకుడు.. హిస్టరీ తెలిస్తే మైండ్ బ్లాంక్..!

ABN, Publish Date - Aug 06 , 2024 | 03:21 PM

ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల అంశంపై బంగ్లాదేశ్‌లో మొదలైన నిరసన.. ఆ దేశ ప్రధానిని గద్దె దింపే వరకు కొనసాగింది. ఓ విద్యార్థి ఉద్యమం ఉవ్వెత్తున కొనసాగడంతో ఓ ప్రధాని తన పదవికి రాజీనామా చేసి.. ప్రాణ రక్షణ కోసం పొరుగు దేశానికి వెళ్లడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది.

Nahid Islam

ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల అంశంపై బంగ్లాదేశ్‌లో మొదలైన నిరసన.. ఆ దేశ ప్రధానిని గద్దె దింపే వరకు కొనసాగింది. ఓ విద్యార్థి ఉద్యమం ఉవ్వెత్తున కొనసాగడంతో ఓ ప్రధాని తన పదవికి రాజీనామా చేసి.. ప్రాణ రక్షణ కోసం పొరుగు దేశానికి వెళ్లడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. రిజర్వేషన్ల అంశంపై సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కూడా విద్యార్థిలోకం శాంతించలేదు. ప్రధానిగా షేక్ హసీనా రాజీనామా చేయాలనే ప్రధాన డిమాండ్‌తో ఆందోళనలు ఉధృతమయ్యాయి. బంగ్లాదేశ్‌లో జరిగిన ఉద్యమం ఏదో ఒక రాజకీయ పార్టీ నేతృత్వంలో చేసింది కాదు. అదొక విద్యార్థి ఉద్యం. విశ్వవిద్యాలయ విద్యార్థులంతా రోడ్లపైకి వచ్చి నిరసన గళమెత్తారు. ఉద్యమం ప్రారంభంలో దీనిని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ కొన్ని రోజులకే హింసాత్మకంగా మారి.. చివరికి ఆ దేశ ప్రధానిని గద్దె దింపేవరకు కొనసాగింది. ఈ ఉద్యమం మొత్తంలో కీలకపాత్ర పోషించిన వ్యక్తి 26 ఏళ్ల యువకుడు. సోషియాలజీ స్టూడెంట్ అయిన నహీద్ ఇస్లాం ఉద్యమం మొత్తానికి నాయకత్వం వహించాడు. చివరికి మద్యంతర ప్రభుత్వంలో ఎవరు ప్రధాన సలహదారుడిగా ఉండాలో కూడా నిర్ణయించే స్థాయికి ఎదిగిన నహీద్ ఇస్లాం అసలు చరిత్ర ఇదే.

Bangladesh : ఆర్మీ చీఫ్‌ అయిన నెలన్నరకే..


సోషియాలజీ స్టూడెంట్..

ఢాకాకు చెందిన 26 ఏళ్ల నహిద్ ఇస్లాం సోషియాలజీ విద్యార్థి. రిజర్వేషన్లపై విశ్వవిద్యాలయ విద్యార్థుల నిరసనలకు నాయకత్వం వహించాడు. క్రమంగా ప్రధాని రాజీనామా చేయాలనే డిమాండ్‌ను తెరపైకి తెచ్చి వార్తల్లో ప్రముఖ వ్యక్తిగా నిలిచాడు. తన నుదిటిపై బంగ్లాదేశ్ జెండాను కట్టుకుని రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరిగిన నిరసనలకు నాయకత్వం వహించాడు. 15 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయాలనే డిమాండ్‌ను తెరపైకి తెచ్చి.. విజయం సాధించాడు. రిజర్వేషన్లపై ఆందోళన చేస్తున్న ఢాకా యూనివర్శిటీకి చెందిన అనేక మంది విద్యార్థులతో పాటు నహిద్ ఇస్లాంను పోలీసులు అరెస్ట్ చేశారు. బంగ్లాదేశ్‌లో జరిగిన ఆందోళనలో దాదాపు 300 మందికి పైగా మరణించారు. వీరిలో ఎక్కువ మంది విద్యార్థులున్నారు. చివరికి విద్యార్థుల ఉద్యమం దెబ్బకు షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత తాత్కాలిక ప్రభుత్వానికి ప్రధాన సలహాదారుగా నోబెల్ బహుమతి గ్రహిత ముహమ్మద్ యూనస్‌ను నియమించాలని డిమాండ్ చేశారు. బంగ్లాదేశ్ అధ్యక్షుడు సైతం విద్యార్థి సంఘాల డిమాండ్‌ మేరకు యూనస్‌ను మధ్యంతర ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా నియమించారు.1998లో ఢాకాలో జన్మించిన నహీద్‌కు వివాహం అయింది. అతడికి ఒక సోదరుడు నకీబ్ ఉన్నారు.

Bangladesh: ప్రభుత్వ ప్రధాన సలహాదారునిగా ప్రొ. యూనస్


కొన్నిరోజులుగా రాజీనామా డిమాండ్..

ఈ ఏడాది బంగ్లాదేశ్ ఎన్నికల తర్వాత ప్రధానిగా షేక్ హసీనా ఎన్నికయ్యారు. అప్పటినుంచి ఆమె రిగ్గింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ఆమె రాజీనామా చేయాలనే డిమాండ్ కొతంకాలంగా వినిపిస్తోంది. చివరకు విద్యార్థి నాయకుడు నహీద్ ఇస్లాం నేతృత్వంలో జరిగిన ఉద్యమంతో షేక్ హసీనా తన పదవిని కోల్పోవలసి వచ్చింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ రాజకీయాల్లో నహీద్ ఇస్లాం పేరు మారుమోగుతోంది. ప్రధానంగా నహీద్ అవామీ లీగ్ పార్టీని టార్గెట్ చేశారని ఆ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇవాళ జరిగిన ఆల్ పార్టీ మీటింగ్‌కు అవామీ లీగ్‌ను ఆహ్వానించకపోవడమే దీనికి కారణంగా పేర్కొంటున్నారు.


Bangladesh : గల్ఫ్‌లో బంగ్లా ప్రవాసీల సంఘీభావం

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More international News and Latest Telugu News

Updated Date - Aug 06 , 2024 | 03:21 PM

Advertising
Advertising
<