ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

New York : అంతరిక్షంలో చైనా వ్యర్థాలు

ABN, Publish Date - Aug 11 , 2024 | 03:33 AM

చైనా రాకెట్‌ నుంచి వెలువడిన వ్యర్థాలు అంతరిక్షంలో భారీ మేఘంలా భూమిచుట్టూ తిరుగుతుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది.

  • లాంగ్‌ మార్చ్‌ 6ఏ రాకెట్‌ నుంచి విడుదల

  • భారీ మేఘంలా భూమి చుట్టూ తిరుగుతుండటంతో ఆందోళన

న్యూయార్క్‌, ఆగస్టు 10: చైనా రాకెట్‌ నుంచి వెలువడిన వ్యర్థాలు అంతరిక్షంలో భారీ మేఘంలా భూమిచుట్టూ తిరుగుతుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. చైనా పంపిన లాంగ్‌ మార్చ్‌ 6ఏ రాకెట్‌ ఈనెల 6వ తేదీన 18 ఉపగ్రహాలను భూ దిగువ కక్ష(ఎల్‌ఈవో)లో సుమారు 800 కిలోమీటర్ల ఎత్తున ప్రవేశపెట్టింది.

ఆ తర్వాత కొద్దిసేపటికే రాకెట్‌ పైభాగంలో పేలుడు సంభవించి వెలువడిన శిథిలాలు భారీ మేఘంలా భూమిచుట్టూ తిరుగుతున్నాయని అమెరికాకు చెందిన స్పేస్‌ కమాండ్‌(యూఎ్‌సస్పే్‌సకాం) తెలిపింది. అందులో సుమారు 300 వరకు ట్రాకెబుల్‌(కనీసం 4 అంగుళాల వ్యాసం ఉన్నవి) శిథిలాలు ఉన్నట్టు ఆ సంస్థ గురువారం ఓ ప్రకటనలో వెల్లడించింది. అయితే, వాటి వల్ల తక్షణ ముప్పు ఏమీ లేదని తెలిపింది.

అయితే, భవిష్యత్తులో పంపే అంతరిక్ష వాహక నౌకలకు ఈ శిథిలాలతో ముప్పు ఉండొచ్చని ఆ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. సెకనుకు 7.5 కిలోమీటర్లు, గంటకు 27 వేల కిలోమీటర్ల వేగంతో కదిలే అంతరిక్షవాహక నౌకలకు ఈ శిథిలాలు తగిలితే ఆందోళనకర పరిస్థితి తలెత్తుతుందని వివరించింది.

Updated Date - Aug 11 , 2024 | 03:33 AM

Advertising
Advertising
<