ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కెనడాలో జాబ్‌ ఆఫర్‌.. ఇమ్మిగ్రేషన్‌ పాయింట్ల ఎత్తివేత!

ABN, Publish Date - Dec 19 , 2024 | 05:25 AM

కెనడాలో శాశ్వత నివాసం పొందేందుకు జాబ్‌ ఆఫర్ల పేరిట మోసాలు జరుగుతున్నట్లు ఆ దేశ ప్రభుత్వం భావిస్తోంది. దీనిని కట్టడి చేసేందుకు నిబంధనలను కఠినతరం చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం

న్యూఢిల్లీ, డిసెంబరు 18: కెనడాలో శాశ్వత నివాసం పొందేందుకు జాబ్‌ ఆఫర్ల పేరిట మోసాలు జరుగుతున్నట్లు ఆ దేశ ప్రభుత్వం భావిస్తోంది. దీనిని కట్టడి చేసేందుకు నిబంధనలను కఠినతరం చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం జాబ్‌ ఆఫర్‌తో ఎక్స్‌ప్రెస్‌ ఎంట్రీ పొందే పాయింట్లను ఎత్తేసే ఆలోచన చేస్తున్నట్లు కెనడా ఇమ్మిగ్రేషన్‌ శాఖ మంత్రి మార్క్‌ మిల్లర్‌ తెలిపారు. సాధారణంగా దేశంలోని వివిధ సంస్థలు నిపుణులైన ఉద్యోగులను నియమించుకోవాలనుకున్నప్పుడు.. అందుకు అర్హత కలిగినవారు ఆ దేశ పౌరుల్లో, అప్పటికే శాశ్వత నివాసం ఉన్నవారిలో లేకపోతే విదేశీ వ్యక్తులను నియమించుకుంటాయి. ఇందుకోసం లేబర్‌ మార్కెట్‌ ఇంపాక్ట్‌ అసె్‌సమెంట్‌ (ఎల్‌ఎంఏఐ) కింద దరఖాస్తు చేసుకుంటాయి. ఈ విధంగా ఇచ్చే జాబ్‌ ఆఫర్‌ ద్వారా ఆయా వ్యక్తులకు ఎక్స్‌ప్రెస్‌ ఎంట్రీ పేరుతో 50 పాయింట్లు అదనంగా లభిస్తాయి. దీంతో.. ఆ వ్యక్తులు కెనడాలో శాశ్వత నివాసం లేదా తాత్కాలిక నివాసం కోరుకుంటే ఈ పాయింట్ల ద్వారా వారికి అదనపు ప్రయోజనం చేకూరుతుంది. అయితే ఈ పేరుతో పలు సంస్థలు మోసాలకు పాల్పడుతున్నాయని, విదేశీ వ్యక్తులు వీటిని కొనుగోలు చేసి.. శాశ్వత నివాసాలు పొందేందుకు అవకాశం కల్పిస్తున్నాయని జస్టిన్‌ ట్రూడో ప్రభుత్వం భావిస్తోంది. దీనిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.

Updated Date - Dec 19 , 2024 | 05:25 AM