Bangladesh Crisis: బంగ్లా రాజకీయ సంక్షోభం వెనుక అతి పెద్ద కుట్ర.. !
ABN, Publish Date - Aug 06 , 2024 | 07:47 PM
బంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభం ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో భారీ విజయాన్ని సాధించిన తర్వాత షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు మొదలవ్వడం.. ఆందోళనల కారణంగా షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి.. ప్రాణరక్షణ కోసం పొరుగు దేశానికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
బంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభం ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో భారీ విజయాన్ని సాధించిన తర్వాత షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు మొదలవ్వడం.. ఆందోళనల కారణంగా షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి.. ప్రాణరక్షణ కోసం పొరుగు దేశానికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. షేక్ హసీనా ప్రభుత్వ పతనం వెనుక భారీ కుట్ర ఉందన్న వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన ఆధారాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇంటెలిజెన్స్ నివేదికల ప్రకారం షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూల్చివేయడం కోసం బ్లూప్రింట్ లండన్‌లో రూపొందించినట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పి) తాత్కాలిక చీఫ్, మాజీ ప్రధాని ఖలీదా జియా కుమారుడు తారిక్ రెహమాన్ సౌదీ అరేబియాలో పాకిస్తాన్‌కు చెందిన ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్(ఐఎస్‌ఐ) అధికారులతో సమావేశమైనట్లు బంగ్లాదేశ్ ఇంటెలిజెన్స్ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. దీనికి సంబంధించిన ఆధారాలు ఉన్నట్లు బంగ్లాదేశ్ అధికారులు తెలిపారు.
Bangladesh : ఆర్మీ చీఫ్ అయిన నెలన్నరకే..
నిరసనలకు ముందు..
షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు ప్రారంభం కావడానికి ముందు పాకిస్తాన్ సహాయంతో సోషల్ మీడియా ద్వారా రెచ్చగొట్టే పోస్టులు పెట్టినట్లు గుర్తించారు. దాదాపు ఎక్స్‌లో 500కు పైగా షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్వీట్లు చేసినట్లు ఇంటెలిజెన్స్ రిపోర్టులు తెలియజేస్తున్నాయి. హసీనా ప్రభుత్వాని్ని అస్థిరపర్చి.. పాకిస్తాన్‌కు అనుకూలంగా వ్యవహరించే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పి) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పాకిస్తాన్ సైన్యం, ఐఎస్‌ఐ పనిచేసినట్లు నిఘా వర్గాలు తెలిపాయి. ఈ కుట్రలో చైనా కూడా తనవంతు పాత్రను పోషించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మొదలైన నిరసనలు.. షేక్ హసీనా రాజీనామా చేయాలనే డిమాండ్‌ను తెరపైకి తెచ్చాయి. చివరికి షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి బంగ్లాదేశ్ నుంచి ప్రాణరక్షణ కోసం పొరుగుదేశానికి వెళ్లాల్సి వచ్చింది.
Bangladesh: ప్రభుత్వ ప్రధాన సలహాదారునిగా ప్రొ. యూనస్
నిరసనలు హింసాత్మకం..
ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కల్పనకు వ్యతిరేకంగా యూనివర్సిటీ విద్యార్థులు నిరసనలకు దిగారు. క్రమంగా ఈ నిరసనలు హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారాయి. ప్రధాని రాజీనామాను డిమాండ్ చేస్తూ హింసాత్మక ఘటనలు చెలరేగాయి. రిజర్వేషన్ల ఉద్యమంలో దాదాపు 300 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఎక్కువమంది విద్యార్థులున్నారు. ఈ నిరసనల వెనుక జమాతే ఇస్లామీ బంగ్లాదేశ్ విద్యార్థి విభాగం, ఇస్లామీ ఛత్ర శిబిర్ (ఐసీఎస్) ఉన్నట్లు బంగ్లాదేశ్ ఇంటటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. ఈ రెండు విద్యార్థి సంఘాలు విద్యార్థులను రెచ్చగొట్టారని, పాకిస్తాన్, చైనాలపట్ల సానుకూలంగా వ్యవహరించే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడం కోసం ఈ విద్యార్థి సంఘాలు కుట్రలో భాగస్వామ్యమైనట్లు నిఘా వర్గాలు వెల్లడిస్తున్నాయి. బంగ్లాదేశ్‌లో ఆందోళనల కోసం ఇస్లామీ ఛత్ర శిబిర్ ఎప్పటినుంచో ప్రణాళికలు రూపొందిస్తుందని, వారికి పాకిస్తాన్‌లో పనిచేస్తున్న చైనా సంస్థలు నిధులు సమకూర్చినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతానికి బంగ్లాదేశ్‌లో మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటైంది. అయితే ప్రధానిగా మరోసారి ఖలీదా జియా బాధ్యతలు స్వీకరిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. బంగ్లాదేశ్ రాజకీయ సంక్షోభం మరెన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాల్సి ఉంది.
Bangladesh : గల్ఫ్‌లో బంగ్లా ప్రవాసీల సంఘీభావం
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More international News and Latest Telugu News
Updated Date - Aug 06 , 2024 | 07:47 PM