ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

PM Modi: సింగపూర్‌లో ఎన్ఆర్ఐలను ఉత్సాహపరుస్తూ మోదీ ఏం చేశారంటే..?

ABN, Publish Date - Sep 04 , 2024 | 03:52 PM

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఏ దేశంలో పర్యటించినా ముఖ్యంగా అక్కడి ప్రవాస భారతీయుల్లో ఆనందోత్సాహాలు అంబరాన్నంటుతుంటాయి. రెండు దేశాల పర్యటనలో భాగంగా తొలుత బ్రూనై పర్యటించిన మోదీ బుధవారంనాడు సింగపూర్‌లో అడుగుపెట్టారు.

సింగపూర్: భారత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ఏ దేశంలో పర్యటించినా ముఖ్యంగా అక్కడి ప్రవాస భారతీయుల్లో ఆనందోత్సాహాలు అంబరాన్నంటుతుంటాయి. రెండు దేశాల పర్యటనలో భాగంగా తొలుత బ్రూనై పర్యటించిన మోదీ బుధవారంనాడు సింగపూర్‌ (Singapore)లో అడుగుపెట్టారు. ఆరేళ్ల తర్వాత మోదీ సింగపూర్‌లో తొలిసారి అడుగుపెట్టడంతో ఆయనకు ఛాంగి విమానాశ్రయంలో అధికారులు ఘనస్వాగతం పలికారు. ఎన్ఐఆర్‌‌లు పెద్దఎత్తున తరలిరావడంతో వారితో మోదీ ముచ్చటించారు. అక్కడి మ్యూజికల్ ట్రూప్‌‌లోని 'డోలు'ను లయబద్ధంగా వాయిస్తూ అందర్నీ మరింత ఉత్సాహపరిచారు.


మోదీ తన పర్యటనలో భాగంగా వాంగ్‌తో పాటు ప్రెసిడెంట్ థర్మన్ షణ్ముగరత్నం, సీనియర్ మంత్రులను కలుసుకుంటారు. మోదీకి వాంగ్ ప్రత్యేక డిన్నర్ ఆతిథ్యం ఇస్తున్నారు. సింగపూర్‌లో అడుగుపెట్టగానే మోదీ ఈ విషయాన్ని సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో పోస్ట్ చేశారు. భారత్-సింగపూర్ మధ్య స్నేహాన్ని విస్తృతం చేస్తూ వివిధ సమావేశాల్లో పాల్గొనేందుకు తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు చెప్పారు. ఇరుదేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలను మరింత ముందుకు తీసుకువెళ్లాలని అనుకుంటున్నట్టు చెప్పారు.

PM Modi: సింగపూర్‌లో మోదీకి ఘన స్వాగతం..ఆరేళ్లలో ఇదే మొదటి పర్యటన


ఇరుదేశాల దౌత్యసంబంధాలకు 60వ వార్షికోత్సవం, వ్యూహాత్మక భాగస్వామ్యానికి 10వ వార్షికోత్సవం సందర్భంగా మోదీ ఈ పర్యటన జరుపుతున్నారు. 1965 నుంచి భారత్-సింగపూర్ మధ్య దౌత్య సంబంధాలు కొనసాగుతున్నాయి. 2015లో మోదీ సింగపూర్ పర్యటనలో వ్యూహాత్మక భాగస్వామ్యం కొత్త పుంతలు తొక్కింది. సింగపూర్‌లో 3.5 లక్షల మంది భారత సంతతి ప్రజలున్నారు.


మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..

Updated Date - Sep 04 , 2024 | 03:55 PM

Advertising
Advertising