రష్యాలో ‘శృంగార మంత్రిత్వ శాఖ’!
ABN, Publish Date - Nov 10 , 2024 | 02:42 AM
దేశంలో జనాభా తగ్గుతుండటం, వృద్ధుల సంఖ్య భారీగా పెరుగుతుండటంతో పెళ్లిళ్లు చేసుకోండర్రా.. పిల్లలను కనండర్రా అని యువతకు ఉద్బోధిస్తోంది చైనా!
ఉక్రెయిన్‌తో యుద్ధం.. సైనికుల మరణాలతో భారీగా తగ్గుతున్న రష్యా జనాభా
జన సంఖ్యను పెంచేందుకు మినిస్ట్రీ ఆఫ్ సెక్స్
రాత్రి 10 నుంచి 2 వరకు ఇంటర్నెట్ బంద్
పని ప్రదేశాల్లో సంతానోత్పత్తి బ్రేక్‌లు
జనాభాను పెంచేందుకే..
న్యూఢిల్లీ, నవంబరు 9: దేశంలో జనాభా తగ్గుతుండటం, వృద్ధుల సంఖ్య భారీగా పెరుగుతుండటంతో పెళ్లిళ్లు చేసుకోండర్రా.. పిల్లలను కనండర్రా అని యువతకు ఉద్బోధిస్తోంది చైనా! జనాభా తగ్గుదల సమస్యను ఎదుర్కొంటున్న రష్యానైతే ఓ అడుగు ముందుకేసి ప్రత్యేకంగా శృంగార మంత్రిత్వ శాఖ (మినిస్ట్రీ ఆఫ్ సెక్స్)ను ఏర్పాటు చేయాలని సీరియ్‌సగా ఆలోచిస్తోంది. ఉక్రెయిన్‌తో యుద్ధం ఫలితంగా జనాభా భారీగా పడిపోవడంతో జనసంఖ్యను పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధ్యక్షుడు పుతిన్ ప్రత్యేక ఆదేశాలిచ్చిన మీదటే ఆయన సలహాదారులు ప్రత్యేకంగా శృంగార మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నారు. మరి.. ఈ శాఖలో భాగంగా ఏంచేస్తారు? అంటే.. పెళ్లైన జంటలు ఏకాంతంగా గడిపేలా ప్రోత్సహిస్తారు. ఇందుకు రాత్రి 10 నుంచి 2 గంటల వరకు ఇంట్లో లైట్లు, ఇంటర్నెట్ బంద్ చేయాలని, ఇంట్లో ఉండే మహిళలకు జీతం ఇవ్వాలని, కొత్త జంటల ఫస్ట్‌నైట్‌కు హోటల్ ఖర్చుల కోసం ప్రత్యేకంగా డబ్బు ఇవ్వాలనే ప్రతిపాదనలున్నాయి. ఇక పని ప్రదేశాల్లో లంచ్, కాఫీ బ్రేక్‌లు సంతానోత్పత్తి బ్రేక్‌లుగా వాడుకోవాలనేది మరో ఆసక్తికరమైన ప్రతిపాదన.
Updated Date - Nov 10 , 2024 | 02:42 AM