ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

US: అమెరికాలో కొత్త రకం ప్లేగు గుర్తింపు.. పిల్లుల ద్వారా వ్యాపిస్తున్నట్లు అనుమానం..

ABN, Publish Date - Feb 14 , 2024 | 10:58 AM

యూఎస్ లోని ఒరెగాన్‌లోని కొత్త రకం వ్యాధిని శాస్త్రవేత్తలు, వైద్యులు కనుగొన్నారు. పెంపుడు పిల్లి ద్వారా సంక్రమించే బుబోనిక్ ప్లేగును గుర్తించినట్లు వెల్లడించారు.

యూఎస్ లోని ఒరెగాన్‌లోని కొత్త రకం వ్యాధిని శాస్త్రవేత్తలు, వైద్యులు కనుగొన్నారు. పెంపుడు పిల్లి ద్వారా సంక్రమించే బుబోనిక్ ప్లేగును గుర్తించినట్లు వెల్లడించారు. బ్లాక్ డెత్ గా పిలుచుకునే ఈ మహమ్మారి మధ్య యుగాల కాలంలో ఐరోపాలో మూడింట ఒక వంతు జనాభాను పొట్టన పెట్టుకుందని తెలిపారు. ఈ వ్యాధికి చికిత్స విధానాలు అందుబాటులో ఉన్నప్పటికీ ఇది ప్రాణాంతకమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. డెస్చుట్స్ కౌంటీకి చెందిన ఓ వ్యక్తికి ఈ వ్యాధి సోకినట్లు గుర్తించారు. పెంపుడు జంతువులతో బాధితునికి ఉన్న అనుబంధాన్ని వైద్యులు అడిగి తెలుసుకున్నారు. అనంతరం చికిత్స ప్రారంభిస్తూ అవసరమైన మందులు అందించారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉంది.

జ్వరం, వికారం, నీరసం, చలి, కండరాల నొప్పులు ఈ వ్యాధి లక్షణాలు. ప్లేగు సోకిన వారం రోజుల తర్వాత నుంచి ఈ లక్షణాలు కనిపిస్తాయి. దీనిని ముందుగా గుర్తించకపోతే రక్తప్రవాహాన్ని అడ్డగించి ఊపిరితిత్తులను ప్రభావితం చేసే ప్రమాదం ఉంది. ఫలితంగా న్యుమోనిక్ ప్లేగుకు దారితీస్తుంది. ఇది చాలా ప్రమాదకరం. అయితే.. అదృష్టవశాత్తూ వ్యాధిని తొలి దశలోనే గుర్తించి అవసరమైన చికిత్స అందించడం విశేషం. దీంతో ప్రమాదాన్ని కొంత మేరకు అయినా నివారించవచ్చు.

మరిన్ని అంతర్జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 14 , 2024 | 10:58 AM

Advertising
Advertising