Bangladesh Crisis: సంక్షోభంలో మరోసారి భారత్‌కు.. సరిగ్గా 50 ఏళ్ల తర్వాత..
ABN, Publish Date - Aug 06 , 2024 | 09:57 PM
బంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభం కారణంగా షేక్ హసీనా తన ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆమె బంగ్లాదేశ్ నుంచి మళ్లీ సుమారు ఐదు దశాబ్ధాల తర్వాత ప్రాణ రక్షణ కోసం భారత్ చేరుకుంది. బంగ్లాదేశ్ నుంచి సైనిక విమానంలో భారత్‌కు వస్తున్న క్రమంలో హసీనా వెంట తన చెల్లి రెహానా ఉన్నారు.
బంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభం కారణంగా షేక్ హసీనా తన ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆమె బంగ్లాదేశ్ నుంచి మళ్లీ సుమారు ఐదు దశాబ్ధాల తర్వాత ప్రాణ రక్షణ కోసం భారత్ చేరుకుంది. బంగ్లాదేశ్ నుంచి సైనిక విమానంలో భారత్‌కు వస్తున్న క్రమంలో హసీనా వెంట తన చెల్లి రెహానా ఉన్నారు. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ హసీనా కుటుంబ సభ్యులు వార్తల్లో నిలిచారు. హసీనా తండ్రి బంగ్లాదేశ్ మాజీ అధ్యక్షుడు షేక్ ముజిబుర్ రెహమాన్, తల్లి బేగం ఫజిలతున్నెసాతో పాటు సోదరులు కమల్, జమాల్, రస్సెల్ 1975 ఆగస్టు 15న సైనిక తిరుగుబాటులో హత్యకు గురయ్యారు. ఈ ఘటన జరిగిన 49 ఏళ్ల తర్వాత బంగ్లాదేశ్ ప్రధానిగా ఉన్న షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేయాల్సివచ్చింది. నిరసనల మధ్య దేశం నుండి పొరుగు దేశానికి వెళ్తున్నప్పుడు ఆమె సోదరి రెహానా హసీనాకు తోడుగా సైనిక విమానంలో ఉన్నారు. ముజిబుర్ రెహ్మాన్ ఐదుగురు సంతానంలో నాల్గవది అయిన అరవై ఎనిమిదేళ్ల షేక్ రెహానా, అక్క షేక్ హసీనాతో తరచూ తన అధికారిక పర్యటనలకు వెళ్లేవారు. అవామీ లీగ్‌లోని ప్రముఖ నాయకులలో ఒకరుగా ఉన్నారు. 2007-2008లో దేశంలో ఎమర్జెన్సీ సమయంలో షేక్ హసీనా జైలుకెళ్లినప్పుడు ఆమెకు అండగా నిలిచారు.
Bangladesh : ఆర్మీ చీఫ్ అయిన నెలన్నరకే..
1975 ఊచకోత..
1975 జూలైలో షేక్ హసీనా తన సోదరి రెహానాతో కలిసి జర్మనీ వెళ్లారు. అప్పట్లో హసీనా భర్త అక్కడ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. జర్మనీకి వెళ్తున్నప్పుడు హసీనాకు సెండాఫ్ చెప్పేందుకు కుటుంబ సభ్యులంతా విమానాశ్రయానికి వచ్చారు. అప్పుడు హసీనా, రెహానా తాము మళ్లీ కుటుంబ సభ్యులను చూడనని ఊహించి ఉండకపోవచ్చు. సరిగ్గా 15 నుంచి 20 రోజుల తర్వాత హసీనా తల్లిదండ్రులు, సోదరులు ధన్మొండిలో సైనిక తిరుగుబాటులో చనిపోయారు. ఈ విషయాన్ని గతంలో ఓ ఇంటర్వ్యూలో హసీనా చెప్పారు. హసీనా కుటుంబ సభ్యులు, సిబ్బందితో పాటు మొత్తం 36 మందిని బంగ్లాదేశ్ ఆర్మీ సిబ్బంది హతమార్చారు. ఆసమయంలో హసీనా, ఆమె భర్త, పిల్లలు భారత్‌లో ఆశ్రయం పొందారు. సైనిక తిరుగుబాటులో తమ కుటుంబం చనిపోయిన తర్వాత తనకు సహాయం అందించిన దేశాల్లో భారత్ ఒకటని షేక్ హసీనా గతంలో గుర్తుచేసుకున్నారు. ఈ కారణంగా హసీనా ప్రధానిగా ఉన్న సమయంలో భారత్‌కు మిత్రదేశంగా ఉంటూ వచ్చారు. ధన్మొండిలో తమ కుటుంబం హత్యకు గురైన తర్వాత ఇందిరాగాంధీ తమకు ఆశ్రయం ఇస్తామని సమాచారం పంపించారన్నారు. ఆ సమయంలో తాము ఢిల్లీలో ఆశ్రయం పొందామన్నారు. ఢిల్లీ నుంచి బంగ్లాదేశ్ వెళ్లి.. తమ కుటుంబంలో ఎంత మంది సజీవంగా ఉన్నారో తెలుసుకోవచ్చనే ఉద్దేశంతో భారత్‌కు చేరుకున్నారు.
Bangladesh: ప్రభుత్వ ప్రధాన సలహాదారునిగా ప్రొ. యూనస్
రెహానా కుటుంబం
బంగ్లాదేశ్ ఊచకోత తర్వాత హసీనా చెల్లి రెహానా బంగ్లాదేశ్ విద్యావేత్త షఫీక్ అహ్మద్ సిద్ధిఖీని వివాహం చేసుకున్నారు. లండన్‌లో వీరి వివాహం జరిగింది. డబ్బులు లేకపోవడంతో షేక్ హసీనా పెళ్లికి వెళ్లలేకపోయింది. ప్రస్తుతం రెహానాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. రద్వాన్ ముజీబ్ సిద్ధిక్ స్ట్రాటజీ కన్సల్టెంట్‌గా పనిచేస్తు్నారు. అదే సమయంలో అవామీ లీగ్ పరిశోధన విభాగం, సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ ఇన్ఫర్మేషన్ ట్రస్టీగా కొనసాగుతున్నారు. కుమార్తె తులిప్ సిద్ధిక్ UKలో లేబర్ పార్టీ నాయకుడిగా ఉన్నారు. రెహనా మూడవ సంతానం అజ్మీనా సిద్ధిక్ రూపాంటి ఉద్యోగం చేస్తోంది. షేక్ రెహానా తన అక్క కష్టసమయాల్లో ఉన్నప్పుడు తోడుగా నిలిచింది. 1975లో ఏం జరుగుతుందో చిన్న వయసులో ఉన్న ఈ ఇద్దరూ ఊహించలేకపోయారు. కానీ ప్రస్తుతం ఏం జరగబోతుందో వాళ్లిద్దరూ ముందే ఊహించారు. నిరసనకారులు ఇంటిని చుట్టుముట్టారు. పరిస్థితి చేయిదాటిపోయింది. అయినప్పటికీ హసీనా మొండిగా ఉన్నారు. సలహాదారులు సైతం ఆమెను ప్రాణ రక్షణ కోసం అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు. మరోసారి తప్పించుకునే అవకాశం రాదని హెచ్చరించినా హసీనా మాత్రం ఎవరి మాట వినలేదని బంగ్లాదేశ్‌కు చెందిన ఓ పత్రిక వెల్లడించింది. హాసీనా సలహాదారులు షేక్ రెహానాను ఆశ్రయించారు. ఆమె తన అక్కతో మాట్లాడినప్పటికీ ఆమె అంగీకరించలేదు. ఇక చివరి ప్రయత్నంగా హసీనా కుమారుడు సజీబ్ వాజెద్ ఆమెను రాజీనామా చేసేందుకు ఒప్పించారు. ఇక వెంటనే అక్కా, చెల్లెల్ల బ్యాగ్‌లను ప్యాక్ చేసి సైనిక విమానంలో ఎక్కించారు. ఆ తర్వాత నిరసనకారులు హసీనా ఇంటిపై దాడిచేసి తన తండ్రి దివంగత ముజిబుర్ రెహ్మాన్ విగ్రహాలను ధ్వంసం చేశారు. నలభై తొమ్మిదేళ్ల తర్వాత హసీనాకు రెండో ప్రమాదం. మొదటి ప్రమాద సమయంలో రెహానా తన అక్కతోనే ఉండగా.. ఈసారి కూడా ఆమె హసీనాతో ఉన్నారు.
Bangladesh : గల్ఫ్‌లో బంగ్లా ప్రవాసీల సంఘీభావం
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More international News and Latest Telugu News
Updated Date - Aug 06 , 2024 | 09:57 PM