ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

King: మీ ఓదార్పు కొత్త శక్తిని ఇస్తోంది.. బ్రిటన్ రాజు ఛార్లెస్ ఎమోషనల్

ABN, Publish Date - Feb 11 , 2024 | 11:03 AM

బ్రిటన్ రాజు ఛార్లెస్-3కు క్యాన్సర్ వ్యాధి సోకిందని ఇటీవల బకింగ్ హోమ్ ప్యాలెస్ ఓ ప్రకటనలో పేర్కొంది. కింగ్ ఛార్లెస్ క్యాన్సర్ వ్యాధి నుంచి కోలుకోవాలని పలువురు ఆకాంక్షించారు. సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేశారు. ఆ పోస్టులకు కింగ్ ఛార్లెస్ స్పందించారు.

ఏబీఎన్ ఇంటర్నెట్ డెస్క్: బ్రిటన్ రాజు ఛార్లెస్-3కు (Charles) క్యాన్సర్ వ్యాధి సోకిందని ఇటీవల బకింగ్ హోమ్ ప్యాలెస్ ఓ ప్రకటనలో పేర్కొంది. కొద్దిరోజులు విధులకు దూరంగా ఉంటారని వెల్లడించింది. దాంతో కింగ్ ఛార్లెస్ క్యాన్సర్ వ్యాధి నుంచి కోలుకోవాలని పలువురు ఆకాంక్షించారు. సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేశారు. ఆ పోస్టులకు కింగ్ ఛార్లెస్ స్పందించారు.

‘తనకు క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ జరిగింది. భయాందోళనకు గురయ్యాను. కష్టకాలంలో తనకు పలువురు అండగా నిలిచారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వారందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. క్యాన్సర్ సోకిన వారు బలహీనంగా ఉంటారు. అలాంటి వారికి ఓదార్పు కొత్త శక్తిని ఇస్తోంది. వైద్యులు, స్వచ్చంద సంస్థలకు కూడా కృతజ్ఞతలు అని’ కింగ్ ఛార్లెస్ భావోద్వేగానికి గురయ్యారు. కింగ్ ఛార్లెస్ చికిత్సకు స్పందిస్తున్నారని, త్వరలో కోలుకుంటారని బకింగ్ హోమ్ ప్యాలెస్ ఒక ప్రకటనలో తెలిపింది.

ఛార్లెస్‌కు ప్రొస్టేట్ గ్రంథికి సంబంధించిన పరీక్షలు నిర్వహించే సమయంలో వ్యాధి నిర్ధారణ జరిగింది. ఏ క్యాన్సర్ వచ్చిందనే అంశాన్ని మాత్రం బకింగ్ హోమ్ ప్యాలెస్ వెల్లడించలేదు. ప్రస్తుతం ఛార్లెస్-3 ఆరోగ్యంగా ఉన్నారని స్పష్టంచేసింది. అనారోగ్య సమస్యలతో గత నెలలో కింగ్ ఛార్లెస్ ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. అక్కడ మూడు రోజులపాటు ఉన్నారు. ఆ సమయంలో క్యాన్సర్ సోకిందనే విషయం తెలిసింది. వ్యాధికి సంబంధించిన చికిత్సను వైద్యులు ప్రారంభించారు. చక్కగా స్పందిస్తున్నారని, త్వరలో కోలుకుంటారని స్పష్టం చేసింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 11 , 2024 | 11:03 AM

Advertising
Advertising