ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Pakistan: పాకిస్తాన్ ఎన్నికల్లో రిగ్గింగ్.. విచారణకు ఉన్నత స్థాయి కమిటీ..

ABN, Publish Date - Feb 18 , 2024 | 01:21 PM

పాకిస్తాన్‌ ఎన్నికల సమయంలో జరిగిన రిగ్గింగ్ ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు ఆ దేశ ఎన్నికల సంఘం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పీఎంఎల్-ఎన్‌కు అనుకూలంగా ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని రావల్పిండి మాజీ కమిషనర్ లియాఖత్ అలీ చత్తా ఆరోపించారు.

పాకిస్తాన్‌ ఎన్నికల సమయంలో జరిగిన రిగ్గింగ్ ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు ఆ దేశ ఎన్నికల సంఘం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పీఎంఎల్-ఎన్‌కు అనుకూలంగా ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని రావల్పిండి మాజీ కమిషనర్ లియాఖత్ అలీ చత్తా ఆరోపించారు. ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులను గెలిచేలా చేశారని అన్నారు. ఇందులో ప్రధాన న్యాయమూర్తి, ఎన్నికల సంఘం ప్రధాన అధికారుల ప్రమేయం ఉందన చెప్పారు. ఈ అవకతవకలకు తానూ బాధ్యత తీసుకుంటున్నట్లు తెలిపారు. దేశానికి వెన్నుపోటు పొడిచానని, అది తనను మనశ్శాంతిగా ఉండనివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం తన పదవికి రాజీనామా చేశారు.

లియాఖత్ అలీ చత్తా ఆరోపణలను పాకిస్తాన్ ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. ఎన్నికల ఫలితాలను మార్చేందుకు ఎవరికీ ఆదేశాలు ఇవ్వలేదని, ఎన్నికల అధికారులు ప్రత్యక్ష పాత్ర పోషించరని వ్యాఖ్యానించింది. లియాఖత్ అలీ రాజీనామాతో రావల్పిండి నూతన కమిషనర్ గా సైఫ్ అన్వర్ జప్పా నియమితులయ్యారు. ఎన్నికలకు సంబంధించినంత వరకు చత్తాకు మాత్రమే సమన్వయ పాత్ర ఉందని చెప్పారు. చత్తా ఆరోపణలపై పీఎంఎల్‌-ఎన్‌ నాయకుడు మర్రియం ఔరంగజేబ్ స్పందించారు. ఆధారాలు ఉంటే బ్యూరోక్రాట్ ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించి ఉండాల్సిందని సూచించారు.


పీటీఐ మద్దతుతో 90 మంది స్వతంత్ర అభ్యర్థులు ఎన్నికల్లో విజయం సాధించారు. జాతీయ అసెంబ్లీలో అతిపెద్ద కూటమిగా అవతరించారు. పీఎంఎల్-ఎన్ 75 సీట్లు గెలుచుకోగా, పీపీపీ 54 సీట్లతో మూడో స్థానంలో నిలిచింది. మెజారిటీ స్థానాలు సాధించినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు అనువైన వాతావరణం లేకపోవడంతో పార్లమెంటులో ప్రతిపక్ష స్థానంలో కూర్చోవాలని పీటీఐ పీటీఐ నిర్ణయించింది. అనూహ్యంగా మరోసారి షరీఫ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 18 , 2024 | 01:21 PM

Advertising
Advertising