ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

PM Modi: యుద్ధానికి ఇది సమయం కాదు, చర్చలకు సహకరిస్తాం: మోదీ

ABN, Publish Date - Jul 10 , 2024 | 06:10 PM

రష్యా, ఉక్రెయిన్ అంశంపై భారత ప్రధాన నరేంద్ర మోదీ తమ వైఖరిని పునరుద్ధాటించారు. యుద్ధాలకు ఇది సమయం కాదని, రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధ పరిష్కారానికి ఎలాంటి సహకారం అవసరమైనా న్యూఢిల్లీ సిద్ధంగా ఉందని చెప్పారు. ఆస్ట్రియాలో పర్యటన సందర్భంగా ఆ దేశ ఛాన్సలర్ కార్ల్ నెహమ్మర్‌తో మోదీ బుధవారంనాడు ద్వైపాక్షిక చర్చలు జరిపారు.

వియెన్నా: రష్యా, ఉక్రెయిన్ అంశంపై భారత ప్రధాన నరేంద్ర మోదీ (Narendra Modi) తమ వైఖరిని పునరుద్ధాటించారు. యుద్ధాలకు ఇది సమయం కాదని, రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధ పరిష్కారానికి ఎలాంటి సహకారం అవసరమైనా న్యూఢిల్లీ సిద్ధంగా ఉందని చెప్పారు. ఆస్ట్రియా(Austria)లో పర్యటన సందర్భంగా ఆ దేశ ఛాన్సలర్ కార్ల్ నెహమ్మర్‌తో మోదీ బుధవారంనాడు ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అనంతరం ఏర్పాటు చేసిన సంయుక్త సమావేశంలో మోదీ మాట్లాడుతూ, ఆస్ట్రియా, భారత్ మధ్య దౌత్య సంబంధాలు ఈ ఏడాదితో 75 ఏళ్లు పూర్తి చేసుకోవడం అభినందనీయమని అన్నారు. తనకు ఘనస్వాగతం పలికిన ఆస్ట్రియా ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు.


సమస్యలకు యుద్ధభూమి పరిష్కారం కాదు

''గతంలో కూడా చెప్పాను. ఇది యుద్ధాలకు సమయం కాదు. సమస్యలకు పరిష్కారం యుద్ధభూమిలో కనుగొనలేం. యుద్ధంలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఇండియా, ఆస్ట్రియా దేశాలు రెండూ దౌత్యానికి, చర్చలకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఆ దేశగా ఎలాంటి సహకారం అవసరమైనా అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం'' అని మోదీ అన్నారు.

PM Modi: మోదీకి రష్యా అత్యున్నత పౌర పురస్కారం


ఉక్రెయిన్‌లో శాంతికి మరోమారు మోదీ పిలుపు

మాస్కోలో రెండ్రోజుల పర్యటన అనంతరం మోదీ ఆస్ట్రియా వచ్చారు. గత 40 ఏళ్లలో ఒక భారత ప్రధాని ఇక్కడ పర్యటించడం ఇదే మొదటిసారి. ఈ సందర్భంగా మరోసారి ఉక్రెయిన్‌లో శాంతి స్థాపన అవసరాన్ని మోదీ పునరుద్ఘాటించారు. ఉగ్రవాదాన్ని భారత్, ఆస్ట్రియా సంయుక్తంగా ఖండిస్తున్నాయని, ఉగ్రవాదం ఏరూపంలో ఉన్నా సహంచరాదనే ఏకాభిప్రాయానికి తాము వచ్చామని చెప్పారు. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రారంభంలోనే ఆస్ట్రియాలో పర్యటించే అవకాశం రావడం సంతోషంగా ఉందని చెప్పారు. ఈ పర్యటన తనకు చారిత్రకపరంగానే కాకుండా ప్రత్యేకమైన పర్యటనగా గుర్తుండిపోతుందన్నారు.


మోదీ మధ్యవర్తిత్వం చేస్తామనలేదు..

కాగా, ఉక్రెయిన్‌ అశంపై మధ్యవర్తిత్వం ప్రతిపాదన ఏదీ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేయలేదని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్.. మాస్కోలో మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. రష్యా-ఉక్రెయిన్ అంశంపై మోదీ సమమర్ధవంతంగా మధ్యవర్తిత్వం వహించగలరని రష్యా అనుకుంటోందా అని ప్రశ్నించినప్పుడు ద్వైపాక్షిక చర్చల్లో మధ్యవర్తిత్వ ప్రస్తావన ఏదీ మోదీ చేయలేదని సమాధానమిచ్చారు. పరిష్కార మార్గాలను మోదీ సూచించారని, రష్యాతో సహా ప్రతి ఒక్కరూ శాంతినే కోరుకుంటున్నారని, ఇదే సమయంలో మనం మన భద్రతను కూడా కోరుకుంటున్నామని, దానిపైనే మాస్కో-న్యూఢిల్లీ పరస్పరం అభిప్రాలు పంచుకున్నాయని పెస్కోవ్ వివరించారు.

Read Latest International News and Telugu News

Updated Date - Jul 10 , 2024 | 07:26 PM

Advertising
Advertising
<