ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Canada: కదులుతున్న రైళ్లోంచి దూకిన భారతీయులు.. అదుపులోకి తీసుకున్న అమెరికా పోలీసులు

ABN, Publish Date - Mar 14 , 2024 | 07:04 PM

కెనడా నుంచి సరకు రవాణా రైలులో అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన ముగ్గురు భారతీయ పౌరులతో సహా నలుగురు వ్యక్తులను యూఎస్ బోర్డర్ పెట్రోలింగ్ పోలీసులు అరెస్టు చేశారు.

కెనడా: కెనడా నుంచి సరకు రవాణా రైలులో అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన ముగ్గురు భారతీయ పౌరులతో సహా నలుగురు వ్యక్తులను యూఎస్ బోర్డర్ పెట్రోలింగ్ పోలీసులు అరెస్టు చేశారు. మార్చి 12న కెనడా నుంచి వస్తున్న సరకు రవాణా రైలులోంచి దూకి అమెరికాలోకి ప్రవేశించడానికి ప్రయత్నించినప్పుడు సరిహద్దు అధికారులు ఒక మహిళతో సహా పలువురు పురుషులను అదుపులోకి తీసుకున్నారు.

న్యూయార్క్‌లోని కెనడా సరిహద్దులో ఉన్న బఫెలోలోని అంతర్జాతీయ రైల్‌రోడ్ వంతెనపై ఈ సంఘటన జరిగింది. సరిహద్దు ఏజెంట్లను గుర్తించిన తర్వాత, రైలు నుంచి దూకిన వారు గాయపడ్డారు. కదలలేని స్థితిలో ఉన్న మహిళను వదిలి మిగతావారు పారిపోయారు. మహిళను ఆసుపత్రికి తరలించారు. ఆమెతోపాటు పట్టుబడిన ఇద్దరు పురుషులను భారతీయులుగా గుర్తించారు. నిందితులను పట్టుకుని కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Updated Date - Mar 14 , 2024 | 07:07 PM

Advertising
Advertising