ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పెగాసస్‌ నిఘా నిజమే!

ABN, Publish Date - Dec 23 , 2024 | 03:45 AM

పెగాసస్‌ సాఫ్ట్‌వేర్‌ ద్వారా వాట్సాప్‌ వినియోగదారులపై నిఘా నిజమేనని అమెరికాలోని ఓ కోర్టు నిర్ధారించింది.

అమెరికా చట్టాలను, వాట్సాప్‌ నిబంధనలను ఉల్లంఘించారు

ఇజ్రాయెల్‌ కంపెనీ ఎన్‌ఎ్‌సఓ పాత్రపై అమెరికా కోర్టు నిర్ధారణ

వాషింగ్టన్‌, డిసెంబరు 22: పెగాసస్‌ సాఫ్ట్‌వేర్‌ ద్వారా వాట్సాప్‌ వినియోగదారులపై నిఘా నిజమేనని అమెరికాలోని ఓ కోర్టు నిర్ధారించింది. పెగాసస్‌ సాఫ్ట్‌వేర్‌ తయారీ సంస్థ అయిన ఎన్‌ఎ్‌సఓ గ్రూప్‌ టెక్నాలజీస్‌..అమెరికా హ్యాకింగ్‌ చట్టాలనేగాక వాట్సాప్‌ నియమ నిబంధనలను కూడా ఉల్లంఘించిందని కోర్టు స్పష్టం చేసింది. ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎ్‌సఓ గ్రూప్‌ టెక్నాలజీ్‌సపై వాట్సాప్‌ యాజమాన్య సంస్థ మెటా.. కాలిఫోర్నియాలోని ఓక్లాండ్‌ న్యాయస్థానంలో ఐదేళ్ల క్రితం దావా వేసింది. తన వినియోగదారుల్లో 1400 మంది (వీరిలో 300 మంది భారతీయులు) ఫోన్లపై 2019 మే నెలలో రెండు వారాలపాటు ఎన్‌ఎ్‌సఓ నిఘా పెట్టిందని ఆరోపించింది. దీనిపై విచారణ కొనసాగించిన మహిళా న్యాయమూర్తి ఫిలిస్‌ హామిల్టన్‌ శుక్రవారం తీర్పును వెలువరించారు. ఎన్‌ఎ్‌సఓ కంపెనీ ఉల్లంఘనలకు పాల్పడిన విషయం వాస్తవమేనని నిర్ధారించారు. దీనిపై వాట్సాప్‌ హర్షం వ్యక్తం చేసింది. ‘ఐదేళ్ల న్యాయపోరాటం ఫలించింది. వాట్సాప్‌, జర్నలిస్టులు, మానవ హక్కుల కార్యకర్తలు, పౌరసమాజంపై చట్టవ్యతిరేక దాడులకు పాల్పడిన ఎన్‌ఎ్‌సఓ ఆ తప్పుల నుంచి ఇక ఎంతమాత్రం తప్పించుకోలేదు. స్పైవేర్‌ కంపెనీలకు ఈ తీర్పు ఒక హెచ్చరికలాంటిది’ అని పేర్కొంది. కాగా, వాట్సా్‌పకు ఎన్‌ఎ్‌సఓ సంస్థ ఎంత నష్టపరిహారం చెల్లించాలన్న దానిపై వచ్చే ఏడాది మార్చిలో మరో కోర్టు విచారణ చేపట్టనుంది.

వారి పేర్లను కేంద్రం వెల్లడించాలి:సుర్జేవాలా

పెగాసస్‌ స్పైవేర్‌ను ఉపయోగించి 300 మంది భారతీయుల వాట్సాప్‌ నెంబర్లపై నిఘా పెట్టినట్లు అమెరికా కోర్టు నిర్ధారించిన నేపథ్యంలో.. కేంద్రానికి, సుప్రీంకోర్టుకు కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి రణ్‌దీప్‌ సుర్జేవాలా ఆదివారం పలు ప్రశ్నలు సంధించారు. నిఘాకు గురైన ఆ 300 మంది ఎవరన్న వివరాలను మోదీ ప్రభుత్వం వెల్లడించాలని డిమాండ్‌ చేశారు. పెగాసస్‌ సాఫ్ట్‌వేర్‌తో పలు రంగాలకు చెందిన వారి ఫోన్లపై నిఘా పెట్టారని వచ్చిన ఆరోపణలను ప్రస్తావిస్తూ.. ‘నిఘాకు గురైన ఆ ఇద్దరు కేంద్రమంత్రులు ఎవరు? ముగ్గురు ప్రతిపక్ష నేతలు ఎవరు? జర్నలిస్టులు, వ్యాపారవేత్తలు ఎవరు? ఈ నిఘా ద్వారా బీజేపీ ప్రభుత్వం, దాని సంస్థలు ఏ వివరాల్ని సేకరించాయి? ఆ సమాచారాన్ని ఎలా వినియోగించారు?’ అంటూ ప్రశ్నలు గుప్పించారు. ఈ పనికి పాల్పడిన ప్రభుత్వ అధికారులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తారా అని నిలదీశారు. ‘పెగాసస్‌ స్పైవేర్‌పై 2021-22లో సాంకేతిక నిపుణుల కమిటీ సమర్పించిన నివేదికను సుప్రీంకోర్టు ఇకనైనా బహిరంగపరుస్తుందా?’ అని రణ్‌దీప్‌ సుర్జేవాలా ప్రశ్నించారు. కాగా, పెగాసస్‌ ద్వారా పలు దేశాల ప్రభుత్వాలు తమ సొంత పౌరుల మీదే నిఘా పెట్టాయని 2021లో ఓ అంతర్జాతీయ మీడియా వేదిక వెల్లడించటంతో ఈ వ్యవహారం బయటపడింది. అయితే, పెగాసస్‌ నిఘా అవాస్తవమంటూ పెగాసస్‌పై కేంద్రం ఏర్పాటు చేసిన సాంకేతిక నిపుణుల కమిటీ తేల్చిందని సుప్రీంకోర్టు పేర్కొంది.

Updated Date - Dec 23 , 2024 | 04:17 AM