ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Washington: హెచ్‌-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు శుభవార్త

ABN, Publish Date - Dec 13 , 2024 | 05:07 AM

హెచ్‌-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు అమెరికా ఓ శుభవార్తను ప్రకటించింది.

  • ఆటోమేటిక్‌ రెన్యువల్‌ గడువు 180 నుంచి 540 రోజులకు పొడిగింపు

  • ఆటోమేటిక్‌ రెన్యూవల్‌ గడువు 540 రోజులకు పొడిగింపు

వాషింగ్టన్‌, డిసెంబరు 12: హెచ్‌-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు అమెరికా ఓ శుభవార్తను ప్రకటించింది. యూఎస్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోం ల్యాండ్‌ సెక్యూరిటీ (డీహెచ్‌ఎస్‌) గురువారం హెచ్‌-1బీ, ఎల్‌1 వీసాదారుల జీవిత భాగస్వాములకు ఆటోమేటిక్‌ వర్క్‌ పర్మిట్‌ రెన్యూవల్‌ కాలపరిమితిని పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటివరకూ ఈ పరిమితి 180 రోజుల వరకే ఉంది.


తాజా ప్రకటనతో ఈ కాలపరిమితి 540 రోజులకు పెరిగింది. వచ్చే జనవరి 13 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. 2022 మే 4న లేదా ఆ తర్వాత దరఖాస్తు చేసుకున్న వారికే ఇది వర్తిస్తుంది. సహజంగా, వీసా జారీ ప్రక్రియలో జాప్యం కారణంగా పనిచేసే అవకాశం కోల్పోతారు. దీంతో అనేక కుటుంబాలు ఇబ్బందుల్లో పడతాయి. ఈ సమస్యకు పరిష్కారంగా గడువును పొడిగిస్తున్నట్లు ఆ ప్రకటన వివరించింది.

Updated Date - Dec 13 , 2024 | 05:07 AM