ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Washington : భారతీయుల పిల్లలకు ‘గ్రీన్‌కార్డ్‌’ దెబ్బ!

ABN, Publish Date - Jul 28 , 2024 | 03:42 AM

అమెరికాలోని భారత సంతతి యువత దేశ బహిష్కరణ సమస్యలో చిక్కుకున్నారు. గ్రీన్‌ కార్డుల కోసం దశాబ్దాలుగా వేచి ఉన్న వీరంతా ఇప్పటికీ కార్డులు రాకపోవడంతో ఇబ్బందుల్లో కూరుకుపోయారు.

  • యుక్తవయసులోకి వచ్చిన కారణంగా అమెరికాలో బహిష్కరణ ముప్పు

  • చిక్కుల్లో లక్షల మంది యువతీ యువకులు

వాషింగ్టన్‌, జూలై 27: అమెరికాలోని భారత సంతతి యువత దేశ బహిష్కరణ సమస్యలో చిక్కుకున్నారు. గ్రీన్‌ కార్డుల కోసం దశాబ్దాలుగా వేచి ఉన్న వీరంతా ఇప్పటికీ కార్డులు రాకపోవడంతో ఇబ్బందుల్లో కూరుకుపోయారు. దీంతో అధ్యక్షుడు జో బైడెన్‌ ఇప్పుడు చొరవ తీసుకుంటే తప్ప వీరి సమస్య పరిష్కారమయ్యేలా కనిపించడం లేదు.


దాదాపు 2,50,000 మందికిపైగా యువతీ యువకులు ఈ సమస్యను ఎదుర్కొంటున్నట్టు వైట్‌ హౌస్‌ మీడియా కార్యదర్శి కరినె జీన్‌ పీర్రే తెలిపారు. వీరందరికీ వయో పరిమితి(21 ఏళ్లు) నిండిపోయిందని, అమెరికా రికార్డుల ప్రకారం ‘ఆధాపడి జీవించే స్థాయి’ని దాటిపోయారని తెలిపారు. అయినప్పటికీ.. సంబంధిత యువతీ యువకులకు ఉపశమనం కలిగేలా చర్యలు తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నట్టు వివరించారు. ‘‘చట్టబద్ధంగా వలస వచ్చిన 2.5 లక్షల మంది యువతీ యువకుల్లో ఎక్కువ మంది భారత సంతతి వారే ఉన్నారు.


వీరందరికీ 21 ఏళ్ల వయసు నిండింది. వీరిని ‘డాక్యుమెంట్‌ డ్రీమర్స్‌’గా పేర్కొంటాం. తాత్కాలిక పనివీసాపై తమ తల్లిదండ్రులతో కలిసి అమెరికాకు చేరుకున్నారు’’ అని సెక్రటరీ పేర్కొన్నారు. కాగా, వయో పరిమితి మీరిపోయిన భారత సంతతి యువతీ యువకులకు తక్షణమే రక్షణ కల్పించాలని వలస విధానం, పౌరసత్వంపై ఏర్పాటైన జ్యుడీషియరీ ఉపసంఘం చైర్మన్‌, చట్టసభ సభ్యుడు అలెక్స్‌ పదిల్లా అధ్యక్షుడు జో బైడెన్‌కు విన్నవించారు. అలెక్స్‌ నేతృత్వంలో 43 మంది చట్టసభ సభ్యులు జూన్‌ 13నే ఈ సమస్యను అధ్యక్షుడి దృష్టికి తీసుకువెళ్లారు.


‘‘వీరంతా మన దేశంలో పెరిగిన వారే. ఇక్కడే చదువుకున్నారు. గ్రాడ్యుయేషన్‌ పట్టాలు సైతం అందుకున్నారు. ఇలాంటి వారిని గ్రీన్‌ కార్డు లేదన్న కారణంగా దేశం నుంచి పంపిచేయడం భావ్యంకాదు. కాబట్టి వారికి రక్షణ కల్పించండి’’ అని చట్టసభ సభ్యులు అధ్యక్షుడికి రాసిన లేఖలో విన్నవించారు.

Updated Date - Jul 28 , 2024 | 08:05 AM

Advertising
Advertising
<