Washinton :అప్పట్లో వివాహేతర సంబంధం ఉండేది!
ABN, Publish Date - Aug 05 , 2024 | 03:42 AM
మొదటి భార్యతో కాపురం చేసిన సమయంలో తనకు వివాహేతర సంబంధం ఉండేదని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారీస్ భర్త డగ్ ఎమ్‌హాఫ్ అంగీకరించారు. కమలా హారీస్ ఆయనకు రెండో భార్య కావడం గమనార్హం.
కమలా హరీస్ భర్త ఒప్పుకోలు
వాషింగ్టన్, ఆగస్టు 4: మొదటి భార్యతో కాపురం చేసిన సమయంలో తనకు వివాహేతర సంబంధం ఉండేదని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారీస్ భర్త డగ్ ఎమ్‌హాఫ్ అంగీకరించారు. కమలా హారీస్ ఆయనకు రెండో భార్య కావడం గమనార్హం. ఈ విషయాలను ఓ న్యూస్ ఛానెల్ వెల్లడించింది.
మొదటి భార్య కెర్‌స్టిన్ ఎమ్‌హా్‌ఫతో కలిసి ఉన్న సమయంలో ఆయనకు ఓ స్కూలు టీచరుతో సంబంధం ఉండేది. వారి పిల్లలు అదే పాఠశాలలో చదివే వారు. ఆమె మాత్రం ఆ పిల్లలకు బోధించేది కాదు. డగ్ కారణంగా 2009లో ఆమె గర్భం దాల్చింది. కానీ గర్భస్రావం కావడంతో ఆమె తల్లికాలేకపోయింది. ఈ కారణంగానే డగ్, కెర్‌స్టిన్‌లు 2010లో విడిపోవాల్సి వచ్చింది.
వివాహేతర సంబంధం కారణంగా మొదటి భార్యతో ఇబ్బందులు ఎదురయ్యాయయని డగ్ అంగీకరించారు. ఇందుకు బాధ్యత తీసుకుంటున్నట్టు చెప్పారు. వారికి కలిగిన సంతానం ఎల్లా, కోల్‌లు ఆయనతో పాటే నివసించడం ప్రారంభించారు. అనంతరం ఆయనకు 2013లో కమలా హారి్‌సతో పరిచయం ఏర్పడింది. 2014లో వారి వివాహం జరిగింది.
అప్పటికే మేజర్లయిన ఎల్లా, కోల్‌లు కమలతోనే నివసించడం ప్రారంభించారు. డగ్..ఎంటర్‌టెయిన్‌మెంట్ లాయర్‌గా విధులు నిర్వరించే వారు. డగ్ వ్యక్తిగత జీవితం, వివాహేతర సంబంధాల గురించి కమలా హారి్‌సకు, పార్టీ నాయకులకు పూర్తిగా తెలుసునని విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి.
కమలా హారిస్‌ను పిల్లలు ఎల్లా, కోల్‌లు ‘మామలా’ అని పిలుస్తుంటారు. కోల్ వివాహాన్ని గత ఏడాది కమలా హారిసే దగ్గరుండి జరిపించడం విశేషం. కెరిస్టిన్ ఎమ్‌హాఫ్ శనివారం ఓ ప్రకటన విడుదల చేస్తూ పలు కారణాల దృష్ట్యా డగ్‌తో విడిపోవాల్సి వచ్చిందని తెలిపారు.
అయితే ఆయన పిల్లలను జాగ్రత్తగా చూసుకొనే మంచి తండ్రి అని ప్రశంసించారు. తాను, డగ్, కమలా హారి్‌సలు మంచి స్నేహితులుగా కొనసాగుతున్నామని పేర్కొన్నారు.
Updated Date - Aug 05 , 2024 | 03:44 AM