Chhattisgarh: హోరాహోరీ కాల్పులు.. 12 మంది మావోయిస్టుల కాల్చివేత
ABN, Publish Date - May 10 , 2024 | 09:00 PM
ఛత్తీస్‌గఢ్ లోని బిజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. మావోయిస్టులకు, భద్రతా సిబ్బందికి మధ్య జరిపిన హోరాహోరీ కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు హతమయ్యారు. యాంటీ నక్సల్స్ ఆపరేషన్‌లో భాగంగా గంగలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పిడియా గ్రామం సమీపంలో ఈ ఎన్‌కౌంటర్ చేటుచేసుకుంది.
బస్తర్: ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh)లోని బిజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. మావోయిస్టులకు, భద్రతా సిబ్బందికి మధ్య జరిపిన హోరాహోరీ కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు హతమయ్యారు. యాంటీ నక్సల్స్ ఆపరేషన్‌లో భాగంగా గంగలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పిడియా గ్రామం సమీపంలో ఈ ఎన్‌కౌంటర్ చేటుచేసుకుంది. ఘటనా స్థలి నుంచి బ్యారెల్ గ్రెనేడ్ లాంచర్ (బీజీఎల్) సహా 12 ఆయుధాలు, 12 బోర్ రైఫిల్స్ స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాలను ఇంకా గుర్తించాల్సి ఉందని అధికారులు తెలిపారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని సౌత్ బస్తర్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కమలోచన్ కస్యప్ తెలిపారు. ఉదయం 9 గంటలకు కాల్పులు మొదలై సాయంత్రం 5 గంటల వరకూ కొనసాగినట్టు చెప్పారు. కాగా, గత ఏప్రిల్ 16న కాంకెర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 29 మంది నక్సలైట్లను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఈ ఏడాది బస్తర్ ప్రాంతంలో జరిగిన వేర్వేరు ఎన్‌కౌంటర్లలో 103 మందికి పైగా మావోయిస్టులు హతమయ్యారు.
Updated Date - May 10 , 2024 | 09:00 PM