ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Chhattisgarh: భీకర ఎన్‌కౌంటర్‌లో 13 మంది నక్సల్స్ హతం

ABN, Publish Date - Apr 03 , 2024 | 03:12 PM

ఛత్తీస్‌గఢ్‌ లోని బిజాపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతాదళాలకు, నక్సల్స్ మధ్య హోరాహోరీగా జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో 13 మంది నక్సల్స్ హతమయ్యారు. పలువురు నక్సల్స్ గాయపడ్డారు. మంగళవారంనాడు మొదలైన ఈ ఎన్‌కౌంటర్ బుధవారంతో ముగిసిందని భద్రతా బలగాలు ఒక అదికారిక ప్రకటనలో తెలిపాయి.

బిజాపూర్: ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh)లోని బిజాపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతాదళాలకు, నక్సల్స్ మధ్య హోరాహోరీగా జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో 13 మంది నక్సల్స్ హతమయ్యారు. పలువురు నక్సల్స్ గాయపడ్డారు. మంగళవారంనాడు మొదలైన ఈ ఎన్‌కౌంటర్ బుధవారంతో ముగిసిందని భద్రతా బలగాలు ఒక అదికారిక ప్రకటనలో తెలిపాయి. పలువురు నక్సల్స్ గాయపడినందున మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పాయి.


బిజాపూర్ ఎన్‌కౌంటర్ వివరాలను బస్తర్ రేంజ్ ఐజీ పి.సుందరరాజ్ తెలియజేస్తూ, నక్సల్స్ ఏరివేత ఆపరేషన్లలో ఇతి పెద్ద విజయమని అన్నారు.గంగలూరులో జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో వెయ్యి మందికి పైగా భద్రతా బలగాలు పాల్గొన్నట్టు చెప్పారు. ఏప్రిల్ 1, 2వ తేదీల్లో కొనసాగిన ఈ ఎన్‌కౌంటర్‌లో 13 మంది నక్సల్స్ హతమయ్యారని, వారి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. పెద్ద సంఖ్యలో నక్సల్స్ గాయపడినట్టు సమాచారం ఉందన్నారు. ఎన్‌కౌంటర్ చోటుచేసుకున్న ప్రాంతం నక్సల్స్‌కు సురక్షిత ప్రాంతంగా ఉందని, గత మూడు నెలల్లో కొత్తగా 16 భద్రతా శిబిరాలు ఏర్పాటు చేశామని పోలీసులు తెలిపారు. బలగాలు సుమారు 20 కిలోమీటర్ల మేర అడవులు, పర్వతాల మీదుగా బలగాలు ప్రయాణించి, నైట్ విజన్ బైనాక్యులర్లు, అధునాతన ఆయుధాలతో ఈ ఆపరేషన్ నిర్వహించినట్టు చెప్పారు. వెస్త్ బస్తర్ డివిజన్ గంగలూర్ ఏరియా కమిటీకి చెందిన కంపెనీ-2 ఇచ్చిన సమాచారంతో గాలింపు చర్యలు చేపట్టామని, నక్సలైట్ ఆర్గనైజేషన్‌లో నెంబర్ 2గా అత్యంత శక్తివంతమైన గ్రూప్‌ను బిజాపూర్ జిల్లాలో కనుగొన్నామని ఐజీ చెప్పారు. రెండు రాత్రుల పాటు జరిగిన ఈ ఆపరేషన్‌లో మంగళవారం వరకూ 10 మంది నక్సల్స్ మృతదేహాలను, బుధవారం ఉదయం మరో 3 మృతదేహాలను, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మృతులలో మహిళలు సైతం ఉన్నట్టు చెప్పారు.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Apr 03 , 2024 | 03:12 PM

Advertising
Advertising