ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Spurious Liquor: కల్తీ మద్యం తాగి.. 14 మందికి తీవ్ర అస్వస్థత

ABN, Publish Date - Aug 20 , 2024 | 02:28 PM

కల్తీ మద్యం తాగి.. 14 మంది ఆసుపత్రి పాలయ్యారు. ఒడిశాలో చికితా ప్రాంతంలోని మౌండ్‌పూర్ గ్రామంలో సోమవారం అర్థరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. మద్యం తాగిన అనంతరం వీరంతా వాంతులు చేసుకోవడంతో.. స్థానికులు వెంటనే స్పందించారు. ఆ క్రమంలో వారిని చికితాలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు.

భువనేశ్వర్, ఆగస్ట్ 20: కల్తీ మద్యం తాగి.. 14 మంది ఆసుపత్రి పాలయ్యారు. ఒడిశాలో చికితా ప్రాంతంలోని మౌండ్‌పూర్ గ్రామంలో సోమవారం అర్థరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. మద్యం తాగిన అనంతరం వీరంతా వాంతులు చేసుకోవడంతో.. స్థానికులు వెంటనే స్పందించారు. ఆ క్రమంలో వారిని చికితాలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. అనంతరం మెరుగైన వైద్య చికిత్స కోసం వారిని ఏమ్‌కేసీహెచ్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరిలించారు. వారిలో ఇద్దరి ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. దీంతో వారికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.


ఈ ఘటనపై సమాచారం అందడంతో.. గంజాం జిల్లా కలెక్టర్‌ ఆసుపత్రికి హుటాహుటిన చేరుకున్నారు. అనంతరం పరిస్థితిని సమీక్షించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను బాధిత కుటుంబాల సభ్యులను అడిగి తెలుసుకున్నారు. అనారోగ్యానికి గురైన వారి ఆరోగ్య పరిస్థితిని ఈ సందర్భంగా వైద్యులను అడిగి తెలుసుకున్నారు.


కల్తీ మద్యం తాలుకా సాంపిల్స్‌ను వైద్య పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపినట్లు జిల్లా కలెక్టర్ వివరించారు. ఈ కేసుకు సంబంధించి పలువురిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పారు. వారిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు. ఈ ఘటనపై ఎక్సైజ్ శాఖ కమిషనర్ స్పందించారు. ఈ ప్రాంతంలో కల్తీ మద్యం విక్రయాలపై ఇప్పటికే ఉక్కు పాదం మోపామని తెలిపారు.


అందులోభాగంగా జిల్లా పోలీసులతోపాటు ఎక్సైజ్ సిబ్బంది సంయుక్తంగా గ్రామీణ ప్రాంతాల్లో దాడులు చేపట్టినట్లు వివరించారు. ఇక ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తార ప్రసాద్ బహనీపతి సైతం స్పందించారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతంలో విక్రయిస్తున్న నకిలీ మద్యాన్ని నిరోధించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఈ సందర్బంగా డిమాండ్ చేశారు.

For Latest News and National News click here

Updated Date - Aug 20 , 2024 | 02:31 PM

Advertising
Advertising
<