Pune Car Crash: పూణె కారు ప్రమాదంలో కేసులో షాకింగ్ ట్విస్ట్.. ఆ రిపోర్ట్‌నే మార్చేసిన డాక్టర్స్
ABN, Publish Date - May 27 , 2024 | 11:32 AM
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పూణె కారు ప్రమాదం (Pune Porche Car Accident) కేసులో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఇప్పుడు తాజాగా మరో ఊహించని ట్విస్ట్‌ని అధికారులు...
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పూణె కారు ప్రమాదం (Pune Porsche Car Accident) కేసులో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఇప్పుడు తాజాగా మరో ఊహించని ట్విస్ట్‌ని అధికారులు గుర్తించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన మైనర్ (17 ఏళ్లు) రక్త నమూనా పరీక్ష నివేదికను ఇద్దరు వైద్యులు మార్చేసినట్లు తేలింది. దీంతో.. ఆ ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో ఒకరు ఆసుపత్రి ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ అజయ్ తవారే అని, మరొకరు డాక్టర్ శ్రీహరి హర్నోల్ అని పూణె పోలీస్ కమిషనర్ అమితేష్ కుమార్ వెల్లడించారు. ఆ ఇద్దరు వైద్యులు సాసూన్ జనరల్ ఆసుపత్రిలో పని చేస్తున్నారు.
టీమిండియా హెచ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్.. ఫోటో చెప్పిన సాక్ష్యం?
కారు ప్రమాదం జరిగిన తర్వాత ఆ మైనర్‌ని అరెస్ట్ చేసిన పోలీసులు.. వైద్య పరీక్షల నిమిత్తం సాసూన్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఉదయం 11 గంటలకు అతని రక్త నమూనాలను సేకరించారు. అయితే.. అతని రక్త నమూనాల్లో ఎటువంటి ఆల్కహాల్ ఆనవాలు లేవని ఆ ఇద్దరు డాక్టర్లు నివేదిక ఇచ్చారు. కానీ.. పోలీసులకు అనుమానం రావడంతో, సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. అందులో నిందితుడు తన స్నేహితులతో కలిసి మద్యం తాగుతున్న దృశ్యాలు స్పష్టంగా రికార్డ్ అయ్యాయి. దీంతో.. రక్త నమూనా పరీక్ష నివేదికను ఆ ఇద్దరు వైద్యులు మార్చినట్లు పోలీసులు ధృవీకరించి, వారిని అరెస్ట్ చేశారు. ఇక్కడ పోలీసులు చేసిన మరో మంచి పనేమిటంటే.. ప్రమాదం జరిగిన రోజున నిందితుడి మరో రక్త నమూనాను డీఎన్ఏ కోసం తీసుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా పోలీస్ కమిషనర్ తెలిపారు.
ఆ రెండు తప్పిదాలే సన్‌రైజర్స్ హైదరాబాద్ కొంపముంచాయా?
కాగా.. మే 19వ తేదీన జరిగిన ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు ఇంజినీర్లు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. ఈ కేసులో జువైనల్ కోర్టు కొన్ని షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయగా.. దానిపై తీవ్ర విమర్శలొచ్చాయి. దాంతో.. జువెనైల్ జస్టిస్ బోర్డ్ తీర్పును సవరించి, బాలుడిని అబ్జర్వేషన్ హోమ్‌కు పంపింది. మరోవైపు.. రియల్టర్ అయిన నిందితుడి తండ్రి ఈ కేసుని తప్పుదోవ పట్టించి, తన కుమారుడ్ని రక్షించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశాడు. ఈ కేసులో తమ డ్రైవర్‌నే ఇరికించాలని చూశారు. కొందరు పోలీసులను ప్రభావితం చేసినట్లు ఆరోపణలూ వచ్చాయి. దీంతో.. నిందితుడి తండ్రి, రెండు బార్‌ల సిబ్బందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది.
Read Latest National News and Telugu News
Updated Date - May 27 , 2024 | 11:32 AM