విద్యార్థిపై సహచర విద్యార్థుల దాడి
ABN, Publish Date - Mar 28 , 2024 | 01:08 PM
పరీక్షల్లో ఆన్సర్ షీట్ చూపించ లేదంటూ విద్యార్థిపై సహచర విద్యార్థులు దాడి చేసి కత్తితో పోడిచారు.
థానే: పరీక్షల్లో ఆన్సర్ షీట్ చూపించ లేదంటూ విద్యార్థిపై సహచర విద్యార్థులు దాడి చేసి కత్తితో పోడిచారు. ఈ ఘటనలో గాయపడిన విద్యార్థి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన మహారాష్ట్ర (Maharashtra) థానే జిల్లాలోని బివండి పట్టణంలో చోటు చేసుకొంది. 10వ తరగతి పరీక్షల జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఎగ్జామ్ హాల్‌లో ఆన్షర్ షీట్ చూపించాలంటూ.. అతని సహచర విద్యార్థులు ముగ్గురు అతడిని కోరారు.
అందుకు అతడు ససేమీరా అన్నాడు. దీంతో ఆ విద్యార్థులు ఆగ్రహించారు. పరీక్ష అనంతరం ఎగ్జామ్ హాల్ బైట ఆన్షర్ షీట్ చూపించని చెప్పిన విద్యార్థిపై కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో అతడు గాయపడ్డారు. ఈ దాడిపై పోలీసులకు ఫిర్యాదు అందడంతో.. గాయపడిన విద్యార్థిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - Mar 28 , 2024 | 02:13 PM