ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Assam : అసోం వరదల్లో 37 మంది మృతి

ABN, Publish Date - Jun 23 , 2024 | 03:01 AM

అసోం వరదల్లో మృతుల సంఖ్య 37కు చేరింది. మరొకరు గల్లంతయ్యారు. సుమారు 4 లక్షల మంది వరద ప్రభావానికి గురై ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

గువాహటీ, జూన్‌ 22: అసోం వరదల్లో మృతుల సంఖ్య 37కు చేరింది. మరొకరు గల్లంతయ్యారు. సుమారు 4 లక్షల మంది వరద ప్రభావానికి గురై ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ 19 జిల్లాల్లో పరిస్థితి ఇంకా దయనీయంగానే ఉందని అధికారులు శనివారం వెల్లడించారు. వరద ప్రభావానికి గురైన ప్రజల సంఖ్య గురువారం 4.09 లక్షలు ఉండగా, శుక్రవారం సాయంత్రానికి అది 3,90,491 కు తగ్గింది. ఒక్క కరీంగంజ్‌ జిల్లాలోనే 2.40 లక్షల మంది వరద ప్రభావానికి గురయ్యారు. అన్ని నదులూ ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. 100కుపైగా పునరావాస క్యాంపుల్లో 15 వేలమందికిపైగా ఆశ్రయం పొందుతుండగా, మరో 125 ఆహార పంపిణీ కేంద్రాల ద్వారా బాధితులకు ఆహారం, తాగునీరు అందజేస్తున్నారు. ఇళ్లు, పశువుల పాకలు, రోడ్లు, వంతెనలు, ఆనకట్టలు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు.

Updated Date - Jun 23 , 2024 | 07:04 AM

Advertising
Advertising