మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఉద్యోగాల కోసం 54.25 లక్షల మంది నిరీక్షణ

ABN, Publish Date - Apr 22 , 2024 | 02:05 PM

రాష్ట్రంలోని ఎంప్లాయ్‌మెంట్‌ కార్యాలయాల్లో ఉద్యోగాల కోసం పేర్లు నమోదుచేసుకున్న వారి సంఖ్య 54.25 లక్షలుందని రాష్ట్రప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది..

ఉద్యోగాల కోసం 54.25 లక్షల మంది నిరీక్షణ
Unmployement in Tamilnadu

  • ఉద్యోగాల కోసం 54.25 లక్షల మంది నిరీక్షణ

పెరంబూర్‌, ఏప్రిల్‌ 21: రాష్ట్రంలోని ఎంప్లాయ్‌మెంట్‌ కార్యాలయాల్లో ఉద్యోగాల కోసం పేర్లు నమోదుచేసుకున్న వారి సంఖ్య 54.25 లక్షలుందని రాష్ట్రప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.

గత మార్చి నెల గణాంకాల ప్రకారం ఎంప్లాయ్‌మెంట్‌ కార్యాలయాల్లో నమోదుచేసుకున్న వారి సంఖ్య 54,52,114గా నమోదైంది.. వారిలో పురుషులు 25,00,134 మంది, మహిళలు 29,24,695 మంది కాగా, హిజ్రాలు 285 మంది ఉన్నారు.

అలాగే, 18 ఏళ్లలోపున్న విద్యార్థులు 10.83 లక్షలు, 19 నుంచి 30 ఏళ్లలోపున్న విద్యార్థులు 23.92 లక్షలు, 31 నుంచి 45 ఏళ్లలోపున్న వారు 17.03 లక్షల మంది ఉన్నారు.

అదే సమయంలో ప్రభుత్వ ఉద్యోగాల్లో దివ్యాంగులకు ప్రాధాన్యత ఇస్తుండడంతో పేరు నమోదుచేసుకొనే వారి సంఖ్య పెరిగింది. 1,49,647 మంది దివ్యాంగులు పేర్లు నమోదుచేసుకోగా, వారిలో పురుషులు 99,680 మంది, మహిళలు 49,967 మంది ఉన్నట్లు ప్రభుత్వం తెలియజేసింది.

ఇవి కూడా చదవండి...

మాధవీలతపై కేసు నమోదు

AP Elections: ఆఖరి నిమిషంలో అనూహ్య పరిణామం.. పాడేరు టికెట్‌‌ గిడ్డి ఈశ్వరికే ఎందుకు..!?

మరిన్ని ఏపీ వార్తల కోసం..

Updated Date - Apr 22 , 2024 | 02:09 PM

Advertising
Advertising