Bomb Threat: పాఠశాలలకు మళ్లీ బాంబు బెదిరింపులు..
ABN , Publish Date - May 06 , 2024 | 02:18 PM
అహ్మదాబాద్‌లోని పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో ఈ బెదిరింపులపై ఆ యా పాఠశాలల యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది. దీంతో పోలీసులు వెంటనే అప్రమత్తమై.. ఆ యా పాఠశాలలకు డాగ్ స్క్వాడ్ బృందాలతో సహా చేరుకున్నారు. ఆ క్రమంలో పాఠశాలలను వారు అణువణువు గాలించారు.
గాంధీనగర్, మే 06: అహ్మదాబాద్‌లోని పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో ఈ బెదిరింపులపై ఆ యా పాఠశాలల యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది. దీంతో పోలీసులు వెంటనే అప్రమత్తమై.. ఆ యా పాఠశాలలకు డాగ్ స్క్వాడ్ బృందాలతో సహా చేరుకున్నారు. ఆ క్రమంలో పాఠశాలలను వారు అణువణువు గాలించారు.
కానీ ఎక్కడా బాంబు ఆచూకీ లభ్యం కాకపోవడంతో.. పాఠశాలల యాజమాన్యంతోపాటు విద్యార్థుల తల్లిదండ్రులు ఊపిరి పిల్చుకున్నారు. ఈ బాంబు బెదిరింపులపై క్రైమ్ బ్రాంచ్ డీసీపీ లావినా సిన్హా స్పందించారు. పాఠశాలలకు వచ్చిన ఈ బాంబు బెదిరింపులు... దేశం వెలుపల నుంచి వచ్చినట్లు గుర్తించామని తెలిపారు.
సోమవారం ఉదయం అహ్మదాబాద్‌లోని ఆరు పాఠశాలలకు ఈ మెయిల్స్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. దీనిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Schools, Colleges Close: నేడు, రేపు స్కూళ్లు, కాలేజీలు బంద్..కారణమిదే
అయితే ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలోని పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఆ క్రమంలో ఢిల్లీలోని పాఠశాలలకు సెలవు ప్రకటించి.. పోలీసులు, భద్రత సిబ్బంది ఆయా పాఠశాలలను జల్లెడ పట్టారు. ఎక్కడా ఎటువంటి బాంబు ఆచూకీ లభ్యం కాలేదు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అలాగే అంతకు ముందు కాన్పూర్, జైపూర్, గోవా ఎయిర్‌పోర్టులకు సైతం బాంబు బెదిరింపులు వచ్చాయి. దీనిపై పోలీసులు సైతం కేసు నమోదు చేసిన విషయం విధితమే.
Read Latest National News And Telugu news