ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కర్ణాటకలో మసీదుపై రాళ్లదాడి.. ఆరుగురి అరెస్టు

ABN, Publish Date - Sep 17 , 2024 | 04:05 AM

దక్షిణకన్నడ జిల్లా కేంద్రం మంగళూరు తాలూకా కాటిపళ్లపేటలో ఆదివారం రాత్రి మసీదుపై రాళ్లు రువ్విన ఘటన ఉద్రిక్తతకు దారితీసింది.

బెంగళూరు, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): దక్షిణకన్నడ జిల్లా కేంద్రం మంగళూరు తాలూకా కాటిపళ్లపేటలో ఆదివారం రాత్రి మసీదుపై రాళ్లు రువ్విన ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. మండ్య జిల్లా నాగమంగలలో గణేశ్‌ నిమజ్జనం సందర్భంగా గొడవలు తలెత్తి దుకాణాలకు నిప్పు, ద్విచక్రవాహనాలను ధ్వంసం చేసిన వైనం తెలిసిందే. ఈ నేపథ్యంలో హిందువులపై దాడి జరిగిందని ఆరోపిస్తూ దక్షిణ కన్నడ జిల్లా బజరంగ్‌దళ్‌, వీహెచ్‌పీ ముఖ్యులు సోమవారం ‘చలో బీసీ రోడ్డు’ ఆందోళనకు పిలుపునిచ్చారు. ఆదివారం రాత్రి సుమారు 10.30గంటల సమయంలో బైక్‌పై వచ్చిన ఇద్దరు మసీదుపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో సోమవారం మంగళూరు వ్యాప్తంగా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా చలో బీసీ రోడ్డు ర్యాలీ శాంతియుతంగా సాగిందని దక్షిణకన్నడ జిల్లా ఎస్పీ చెప్పారు.

Updated Date - Sep 17 , 2024 | 04:05 AM

Advertising
Advertising