ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Tamilnadu: నగదుతో కంటైనర్‌లో పరారీ... సినీ ఫక్కీలో ఛేజింగ్..

ABN, Publish Date - Sep 28 , 2024 | 02:55 PM

పలు ఏటీఎంలను పగలు కొట్టి అందులోని భారీ నగదును కొల్లగొట్టి కంటైనర్‌లో పరారవుతున్న దొంగలను పోలీసులు వెంటాడి పట్టుకున్నారు. ఈ ఘటనలో దొంగలు, పోలీసుల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఒక దొంగ మరణించగా.. పలువురు దొంగలతోపాటు పోలీసులకు సైతం గాయాలయ్యాయి.

చెన్నయి, సెప్టెంబర్ 28: పలు ఏటీఎంలను పగలు కొట్టి అందులోని భారీ నగదును కొల్లగొట్టి కంటైనర్‌లో పరారవుతున్న దొంగలను పోలీసులు వెంటాడి పట్టుకున్నారు. ఈ ఘటనలో దొంగలు, పోలీసుల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఒక దొంగ మరణించగా.. పలువురు దొంగలతోపాటు పోలీసులకు సైతం గాయాలయ్యాయి. ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. కేరళ త్రిసూర్‌‌తోని వివిధ ప్రాంతాల్లోని ఎస్‌బీఐ ఏటీఎంలు పగులకొట్టి భారీగా నగదు చోరీ చేశారు.

Also Read: Harish Rao: కన్నీరు పెట్టుకున్న హరీశ్ రావు.. ఇంతకీ ఏమైందంటే..

Also Read: PM Modi: నేడు జమ్మూకు ప్రధాని మోదీ


దాదాపు రూ. 60 లక్షలకు పైగా నగదు చోరీ జరిగినట్లు సమాచారం. అయితే ఏటీఎంలలో చోరీకి పాల్పడిన దొంగలు కంటైనర్‌లో నగదుతోపాటు పరారవుతున్నట్లు తమిళనాడులోని నమక్కల్ జిల్లా పోలీసులకు సమాచారం అందించింది. దీంతో వారు రంగంలోకి దిగారు. ఆ కంటైనర్‌ను ఆపేందుకు జిల్లా పోలీసులు ప్రయత్నించారు. కానీ కంటైనర్ డ్రైవర్.. మాత్రం వేగంగా ముందుకు పోనిచ్చాడు. దీంతో పోలీసులు కంటైనర్‌ను వెంబడించారు. పోలీసులపైకి దొంగలు కాల్పులు జరిపారు. దాంతో పోలీసులు సైతం ఎదురు కాల్పులకు దిగారు. ఈ కాల్పుల్లో ఒక దొంగ మరణించారు. అలాగే పలువురు దొంగలతోపాటు పోలీసులకు సైతం గాయా పడ్డారు.

Also Read: Bhavika Mangalanandan: పాకిస్థాన్ సంగతి ప్రపంచానికి తెలుసు

Also Read: Hardeep Singh Puri: పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గనున్నాయా? కేంద్రమంత్రి కీలక ప్రకటన


దాదాపు 12 కిలోమీటర్ల మేర ఈ ఛేజింగ్ సీన్ సాగింది. అనంతరం కంటైనర్‌ను పోలీసులు నిలువరించారు. దీంతో ఆరుగురు దొంగలను పట్టుకున్నారు. అలాగే కంటైనర్‌లోని భారీ నగదుతోపాటు ఓ కారును సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నగదు రూ. 60 లక్షల వరకు ఉంటుందని పోలీస్ ఉన్నతాధికారులు వెల్లడించారు.

Also Read: Nirmala Sitharaman: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌పై కేసు నమోదుకు ఆదేశం

Also Read: Web Story: గోంగూర వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే.. అసలు వదిలి పెట్టరు


వీరంతా హరియాణాకు చెందిన గ్యాంగ్ అని వివరించారు. ఏటీఎంల్లో చోరీ చేసే సమయంలో ఏటీఎం అండర్ రిపేర్ అంటూ బోర్డ్ పెట్టేవారని వివరించారు. దీంతో నగదు తీసుకునేందుకు ఎవరూ ఈ ఏటీఎం వద్దకు వచ్చే వారు కాదన్నారు. దీంతో ఏటీఎం చోరీ చేయడం వీరికి చాలా సులువైందని చెప్పారు. అయితే ఈ గ్యాంగ్ పారిపోతున్నట్లు తమిళనాడులోని నమక్కల్ జిల్లా పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఈ గ్యాంగ్ వెళ్తున్న కంటైనర్‌ను ఛేజ్ చేసి వారిని అరెస్ట్ చేశారు. గాయపడిన పోలీసులు చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినట్లు ఐజీ సెంథల్ కుమార్ చెప్పారు. ఈ గ్యాంగ్‌లో మొత్తం 7గురు ఉన్నారన్నారు. ఒకరు మరణించడంతో ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు చె్ప్పారు.

Also Read: Mumbai: నగరానికి పొంచి ఉన్న ముప్పు.. అప్రమత్తమైన పోలీసులు

For National News And Telugu News..

Updated Date - Sep 28 , 2024 | 03:01 PM