ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Ayodhya: రాములోరి భోగం.. స్వచ్ఛమైన నెయ్యితో 44 క్వింటాళ్ల లడ్డూలు కానుక..

ABN, Publish Date - Jan 11 , 2024 | 04:10 PM

దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా అయోధ్య పై చర్చే.. ఏ నోట విన్నా రామనామమే. సంక్రాంతి సంబరాలు ఓ వైపు.. అయోధ్య

దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా అయోధ్య పై చర్చే.. ఏ నోట విన్నా రామనామమే. సంక్రాంతి సంబరాలు ఓ వైపు.. అయోధ్య రాముని ప్రాణప్రతిష్ఠ మరోవైపు. ఆలయ ప్రారంభ ఘడియల కోసం సమస్త భక్తజనం కళ్లల్లో వత్తులు వేసుకుని మరీ ఎదురుచూస్తున్నారు. రామయ్యకు దేశం నలుమూలలనుంచి పెద్ద ఎత్తున కానుకలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే రామయ్యకు అత్తారింటి నుంచి స్పెషల్‌ స్వీట్స్‌, వెండి బాణం కానుకలుగా వచ్చిన విషయం తెలిసిందే. తిరుమల శ్రీనివాసుడు కూడా లక్ష లడ్డూలు పంపిస్తున్నాడు. ఇప్పుడు మరో భక్తుడు రాములోరికి స్వచ్ఛమైన నేతి లడ్డూలను ప్రసాదంగా అందించనున్నట్లు వెల్లడించడం విశేషం.

బాల రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా.. అయోధ్యకు తరలివచ్చే భక్తులకు దేవ్రహా బాబా లడ్డూ ప్రసాదాన్ని పంపిణీ చేయనున్నారు. ఈ ప్రసాదాన్ని స్వచ్ఛమైన దేశీ నెయ్యితో తయారు చేస్తున్నారు. రామ మందిర నిర్మాణాన్ని ముందే ఊహించిన ఈ సాధువు.. శ్రీరాముడు జన్మించిన ప్రదేశం ఇదేనని అన్నాడు. శ్రీరామునికి భోగంగా సమర్పించేందుకు 44 క్వింటాళ్ల లడ్డూలను దేశీ నెయ్యితో తయారు చేస్తున్నామని, ఒక్క చుక్క నీరు కూడా వాడలేదని దేవ్రహ బాబా శిష్యులు తెలిపారు. ఈ లడ్డూలు ఆరు నెలల వరకూ చెడిపోవని పేర్కొన్నారు. రామ్‌లల్లాకు వెండి పళ్లెంలో నైవేద్యంగా సమర్పించిన అనంతరం భక్తులకు పంపిణీ చేస్తామని వెల్లడించారు.

మరిన్ని వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Jan 11 , 2024 | 04:13 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising