ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Florida : ఆన్‌లైన్‌ గేమ్‌లో గొడవ..

ABN, Publish Date - Jun 27 , 2024 | 05:34 AM

ఆ ఇద్దరు యువకులూ ‘ఆర్చ్‌ఏజ్‌’ అనే ఆన్‌లైన్‌ ఫాంటసీ గేమ్‌ ఆడేవారు. ఒకరి పేరు కాంగ్‌.. ఉండేది న్యూజెర్సీ. మరొకతను దిన్హ్‌.. వందల కిలోమీటర్ల దూరంలోని ఫ్లోరిడా రాష్ట్రంలో ఉంటాడు.

  • న్యూజెర్సీ నుంచి ఫ్లోరిడా వచ్చి సుత్తితో దాడి

ఫ్లోరిడా, జూన్‌ 26: ఆ ఇద్దరు యువకులూ ‘ఆర్చ్‌ఏజ్‌’ అనే ఆన్‌లైన్‌ ఫాంటసీ గేమ్‌ ఆడేవారు. ఒకరి పేరు కాంగ్‌.. ఉండేది న్యూజెర్సీ. మరొకతను దిన్హ్‌.. వందల కిలోమీటర్ల దూరంలోని ఫ్లోరిడా రాష్ట్రంలో ఉంటాడు.

ఆన్‌లైన్‌లో పరిచయమైన వారిద్దరూ ఎప్పుడూ కలుసుకోలేదు. ఆన్‌లైన్‌ గేమ్‌లో గొడవపడి దిన్హ్‌పై కత్తికట్టాడు కాంగ్‌! అతడిని హతమర్చాలని న్యూజెర్సీలో విమానమెక్కి ఫ్లోరిడాలోని జాక్సన్‌విల్‌లో దిగాడు. అక్కడ నుంచి దిన్హ్‌ ఉండే ఫెర్నండినా బీచ్‌ నగరానికి చేరుకున్నాడు. హోటల్‌లో రూం తీసుకున్నాడు.

సుత్తి, ఫ్లాష్‌లైట్‌ కొన్నాడు. నలుపు రంగు దుస్తులు, మాస్క్‌, గ్లవ్స్‌ ధరించి అర్ధరాత్రి దాటక దిన్హ్‌ ఇంట్లోకి చొరబడి అతనిపై సుత్తితో దాడి చేశాడు. దిన్హ్‌ అరుపులతో నిద్రలేచిన అతని తండ్రి పరుగున వచ్చి నిర్ఘాంతపోయాడు. రక్తమోడుతున్న దిన్హ్‌.. కాంగ్‌ నుంచి తప్పించుకునేందుకు పెనుగులాడుతున్నాడు. తండ్రి వెంటనే పోలీసులకు ఫోన్‌ చేసి.. కాంగ్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. పోలీసులు కాంగ్‌ను అరెస్టు చేసి, హత్యాయత్నం కేసు నమోదు చేశారు.

Updated Date - Jun 27 , 2024 | 05:39 AM

Advertising
Advertising