Aamir Khan: ఆమిర్ ఖాన్ డీప్‌ఫేక్ వీడియో వివాదం.. ఇంతకీ అందులో ఏముందంటే?
ABN, Publish Date - Apr 18 , 2024 | 10:59 AM
సరికొత్త ఆవిష్కరణలు, కెరీర్‌ని మెరుగుపరచుకోవడం కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని తీసుకొస్తే.. కొందరు దుండగులు మాత్రం దానిని తప్పుడు పనుల కోసం వినియోగిస్తున్నారు. ముఖ్యంగా.. డీప్‌ఫేక్ వీడియోలతో వివాదానికి తెరలేపుతున్నారు. సాంకేతిక రంగంలో అల్లకల్లోల వాతావరణం సృష్టిస్తున్నారు.
సరికొత్త ఆవిష్కరణలు, కెరీర్‌ని మెరుగుపరచుకోవడం కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని (Artificial Intelligence) తీసుకొస్తే.. కొందరు దుండగులు మాత్రం దానిని తప్పుడు పనుల కోసం వినియోగిస్తున్నారు. ముఖ్యంగా.. డీప్‌ఫేక్ వీడియోలతో (Deepfake Videos) వివాదానికి తెరలేపుతున్నారు. సాంకేతిక రంగంలో అల్లకల్లోల వాతావరణం సృష్టిస్తున్నారు. మొదట్లో హీరోయిన్లను టార్గెట్ చేసుకొని అసభ్యకరమైన వీడియోలను వైరల్ చేసిన దుండగులు.. ఇప్పుడు హీరోలని సైతం విడిచిపెట్టడం లేదు. రకరకాల ప్రచార వీడియోల్లో హీరోల ఫేస్‌లను మార్ఫింగ్ చేసి.. సోషల్ మీడియాలో వదులుతున్నారు.
తల్లి చేసిన తప్పుకి బాబుకి శాపం.. ప్రెగ్నెన్సీ టైంలో పిల్లి మాంసం తినడంతో..
తాజాగా బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ (Aamir Khan) కూడా ఈ డీప్‌ఫేక్ వీడియో బారిన పడ్డాడు. అతనికి సంబంధించిన ఓ వీడియో వివాదాస్పదంగా మారింది. అందులో.. ఓ రాజకీయ పార్టీని (Political Party) ప్రమోట్ చేస్తూ ఆమిర్ ఖాన్ కనిపించాడు. ఈ వీడియో తమ దృష్టికి చేరడంతో.. ఆ నటుడి బృందం వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. తమ నటుడు ఏ రాజకీయ పార్టీని ప్రమోట్ చేయడం లేదని, అదొక ఫేక్ వీడియో అని క్లారిటీ ఇస్తూ.. దానిపై ఫిర్యాదు చేశారు. దీంతో.. పోలీసులు పేరు తెలియని ఓ వ్యక్తిపై కేసు నమోదు చేశారు. భారతీయ శిక్షాస్మృతి (IPC)లోని సంబంధిత సెక్షన్స్ 419, 420 & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని ఇతర సెక్షన్‌ల కింద ఖర్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు.
జపాన్ బుల్లెట్ ట్రైన్‌లో అరుదైన ఘటన.. పాము చేసిన రచ్చ కారణంగా..
ఈ వ్యవహారంపై ఆమిర్ ఖాన్ బృందంలోని ఓ వ్యక్తి మాట్లాడుతూ.. మిస్టర్ ఖాన్ గతంలో ఎన్నికల కమిషన్ ప్రచారాల ద్వారా ప్రజల్లో చైతన్యం కల్పించే ప్రయత్నం చేశారని, కానీ ఏ ఒక్క రాజకీయ పార్టీని ఆయన ప్రమోట్ చేయలేదని క్లారిటీ ఇచ్చారు. ఓ రాజకీయ పార్టీని ఆమిర్ ప్రమోట్ చేస్తున్నట్టు వైరల్ అవుతున్న ఈ వీడియో తమ దృష్టికి చేరగానే షాక్‌కి గురయ్యామని అన్నారు. ఇదొక ఫేక్ వీడియో అని స్పష్టం చేసిన ఆయన.. తాము సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశామని, ముంబై పోలీసుల సైబర్ క్రైమ్ సెల్‌లో ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశామని చెప్పుకొచ్చాడు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - Apr 18 , 2024 | 11:44 AM