ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Delhi liquor policy case: ఈడీ ముందు హాజరైన 'ఆప్' నేత కైలాష్ గెహ్లాట్

ABN, Publish Date - Mar 30 , 2024 | 02:38 PM

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు తర్వాత కూడా 'ఆప్' నేతలను వెంటాడుతోంది. ఈ కేసులో అవినీతి, మనీలాండరింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలను ఎదుర్కొంటున్న ఢిల్లీ మంత్రి, ఆప్ నేత కైలాష్ గెహ్లాట్ శనివారంనాడు ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు.

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు (Delhi Liquor policy case) ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) అరెస్టు తర్వాత కూడా 'ఆప్' (AAP) నేతలను వెంటాడుతోంది. ఈ కేసులో అవినీతి, మనీలాండరింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలను ఎదుర్కొంటున్న ఢిల్లీ మంత్రి, ఆప్ నేత కైలాష్ గెహ్లాట్ (Kailash Gahlot) శనివారంనాడు ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు.


నజఫ్‌గఢ్ ఎమ్మెల్యేగా ఉన్న గెహ్లాట్ (49) కేజ్రీవాల్ మంత్రివర్గంలో రవాణా, హోం అండ్ లా మంత్రిగా ఉన్నారు. పీఎంఎల్ఏ కింద ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసేందుకు తమ ముందు హాజరుకావాల్సిందిగా ఈడీ సమన్లు జారీ చేసిందని, కేజ్రీవాల్ అరెస్టు తర్వాత ఆయనకు ఈ సమన్లు వచ్చాయని అధికారిక వర్గాల సమాచారం. మనీలాండరింగ్ కేసులో ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్‌ను మార్చి 21వ తేదీన ఈడీ అరెస్టు చేయగా, ఏప్రిల్ 1వ వరకూ ఆయనను ఈడీ కస్టడీకి అప్పగించారు. కేజ్రీవాల్ తమ ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వడం లేదని, డిజిటల్ పరికరాల పాస్‌వర్డ్‌లు ఇవ్వడం లేదని ఈడీ ఆరోపణగా ఉంది. కేసు విచారణ సందర్భంగా కేజ్రీవాల్ తన వాదనలు వినిపిస్తూ, ఎక్సైజ్ పాలసీ కేసులో నలుగురు సాక్ష్యలు తన పేరు చెప్పినంత మాత్రాన ఒక సిట్టింగ్ సీఎంను అరెస్టు చేయడానికి నాలుగు స్టేట్‌మెంట్లు సరిపోతాయా? అని ప్రశ్నించారు. ఈడీ దర్యాప్తును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 30 , 2024 | 02:42 PM

Advertising
Advertising