ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AAP: ఎన్నికల వేళ 'ఆప్'కు ఎదురుదెబ్బ..మరో ఎమ్మెల్యే రాజీనామా

ABN, Publish Date - Dec 10 , 2024 | 08:38 PM

ఆమ్ ఆద్మీ పార్టీ మంగళవారంనాడు విడుదల చేసిన పార్టీ అభ్యర్థుల రెండో జాబితాలో సీలంపూర్ నియోజకవర్గం అభ్యర్థిగా జుబైర్ అహ్మద్‌ను నిలబెట్టింది. దీంతో 24 గంటలు తిరక్కుండానే అబ్దుల్ రెహ్మాన్ పార్టీ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు

న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)కి గట్టి దెబ్బ తగిలింది. సీలంపూర్ ఎమ్మెల్యే అబ్దుల్ రెహ్మాన్ (Abdul Rehman) మంగళవారంనాడు పార్టీకి రాజీనామా చేసారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజాసమస్యలను కేజ్రీవాల్ నిర్లక్ష్యం చేస్తున్నరని తన రాజీనామా పత్రంలో ఆయన ఆరోపించారు. ఆమ్ ఆద్మీ పార్టీ మంగళవారంనాడు విడుదల చేసిన పార్టీ అభ్యర్థుల రెండో జాబితాలో సీలంపూర్ నియోజకవర్గం అభ్యర్థిగా జుబైర్ అహ్మద్‌ను నిలబెట్టింది. దీంతో 24 గంటలు తిరక్కుండానే అబ్దుల్ రెహ్మాన్ పార్టీ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మైనారిటీ హక్కులను పార్టీ నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపిస్తూ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తు్న్నట్టు ప్రకటించారు.

Kiran Rijiju: మెజారిటీ మాదే.. ధన్‌ఖడ్‌పై అవిశ్వాస తీర్మానంలో పసలేదు


''ఆమ్ ఆద్మీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఈరోజు రాజీనామా చేశాను. అధికారమే పరమావధిగా రాజకీయాలు చేస్తూ ముస్లింల హక్కులను పార్టీ నిర్లక్ష్యం చేస్తోంది. అరవింద్ కేజ్రీవాల్ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజా సమస్యలను గాలికి వదిలేస్తున్నారు. న్యాయం కోసం, హక్కుల కోసం నా పోరాటం కొనసాగుతుంది'' అని రెహ్మాన్ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.


కాగా, రెహ్మాన్ గత నెలరోజులుగా పార్టీ పట్ల అసంతృప్తితో ఉన్నట్టు చెబుతున్నారు. జుబైర్ అహ్మద్‌ను పార్టీలోకి తీసుకున్నప్పటి నుంచి ఆయన అసంతృప్తితో ఉన్నారు. సైద్ధాంతిక విభేదాల కారణంగా అక్టోబర్ 29న ఆప్ మైనారిటీ విభాగం పదవికి ఆయన రాజీనామా చేశారు. 70 మంది సభ్యుల ఢిల్లీ అసెంబ్లీకి 2025 ఫిబ్రవరిలోగా ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. ఢిల్లీ 7వ అసెంబ్లీ పదవీకాలం వచ్చే ఫిబ్రవరి 15వతేదీతో ముగుస్తుంది.


ఇవి కూడా చదవండి..

INDIA Block: మమతకు మద్దతు తెలిపిన మాజీ సీఎం

CM Stalin: సీఎం స్టాలిన్ సంచలన కామెంట్స్.. ఆ ప్రాజెక్టు అమలైతే పదవికి రాజీనామా..

For National News And Telugu News

Updated Date - Dec 10 , 2024 | 08:38 PM